AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: తెలుగబ్బాయికి నో ఛాన్స్‌.. ప్రసిద్ధ్‌ ఔట్‌.. ఆసీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా ప్లేయింగ్‌-XI ఇదే

గౌహతిలో సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయిన భారత యువ జట్టు శుక్రవారం (డిసెంబర్‌ 1) ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడనుందిజ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.

IND vs AUS: తెలుగబ్బాయికి నో ఛాన్స్‌.. ప్రసిద్ధ్‌ ఔట్‌.. ఆసీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా ప్లేయింగ్‌-XI ఇదే
India Vs Australia
Basha Shek
|

Updated on: Dec 01, 2023 | 12:55 PM

Share

గౌహతిలో సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయిన భారత యువ జట్టు శుక్రవారం (డిసెంబర్‌ 1) ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడనుందిజ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇటీవల ముగిసిన 2023 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చి తొలి మూడు టీ20లకు విశ్రాంతి తీసుకున్న శ్రేయాస్ అయ్యర్ ఇవాల్టి మ్యాచ్‌లో పునరాగమనం చేయనున్నాడు. నాలుగో టీ20 మ్యాచ్ కోసం అయ్యర్ రాయ్‌పూర్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా ఉన్న తిలక్‌ వర్మ స్థానంలో అయ్యర్‌ జట్టులోకి రానున్నాడు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవాలి.

ఇక నేటి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చోటుచేసుకోవడం ఖాయం. వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రాకతో మెన్ ఇన్ బ్లూ బ్యాటింగ్ బలం పెరిగింది. అదే సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌ కోసం తిలక్ వర్మ తన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. గత మూడు మ్యాచుల్లో భారీగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ధ్‌ కృష్ణపై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతనికి బదులు దీపక్ చాహర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ రెండు మార్పులు తప్పితే గత మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లు ఈరోజు కూడా బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం రింకూ సింగ్ ఫినిషర్‌గా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు. కాబట్టి తన ప్లేస్‌లో ఎలాంటి మార్పు ఉండదు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ కూడా ధాటిగా ఆడుతున్నారు. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడతున్నారు. అయితే ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. రవి బిష్టోయ్ స్పిన్ మ్యాజిక్ బాగా పని చేస్తోంది. అయితే భారత ఫాస్ట్‌ బౌలర్లు మాత్రం భారీగా పరుగులు ఇస్తుండడం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టీ20కి భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్

బరిలోకి శ్రేయస్ అయ్యర్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..