Rohit Sharma: ‘రోహిత్, నీ సేవలకో దండం.. సిడ్నీలో కెప్టెన్‌గా బుమ్రా’: బాంబ్ పేల్చిన స్టార్ ప్లేయర్

|

Dec 30, 2024 | 8:13 AM

Rohit Sharma Failed: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయిన రోహిత్ శర్మ ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అతని పేలవమైన ఫామ్, కెప్టెన్సీలో తీసుకున్న నిర్ణయాల కారణంగా, ఈ ఒత్తిడి మునుపటి కంటే ఎక్కువగా పెరిగింది. అతనిని తొలగించాల్సిన అవసరం ఉందని డిమాండ్లు వస్తున్నాయి.

Rohit Sharma: రోహిత్, నీ సేవలకో దండం.. సిడ్నీలో కెప్టెన్‌గా బుమ్రా: బాంబ్ పేల్చిన స్టార్ ప్లేయర్
Rohit Clueless Captaincy
Follow us on

Rohit Sharma Failed: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-3తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అతని కెప్టెన్సీలో టీమ్ ఇండియా కష్టపడుతోంది. రోహిత్ కెప్టెన్సీ నిరంతరం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అతని బ్యాట్ నుంచి పరుగులు పూర్తిగా దూరమయ్యాయి. అతడిని తొలగించి జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో మెల్‌బోర్న్ టెస్ట్ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? సిడ్నీ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారా? అనే వార్తలపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మార్క్ వా క్లారిటీ ఇచ్చాడు. తాను భారత జట్టు సెలక్టర్‌గా ఉండి ఉంటే.. సరిగ్గా ఇదే చేసి ఉండేవాడినంటూ షాక్ ఇచ్చాడు.

మెల్బోర్న్ టెస్ట్ నాలుగో రోజు వ్యాఖ్యానిస్తూ, మార్క్ వా భారత కెప్టెన్ గురించి కీలక ప్రకటన చేశాడు. ఈ టెస్ట్ తర్వాత రోహిత్‌ను తప్పించేందుకు పూర్తిగా మద్దతు ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. అడిలైడ్ టెస్టు నుంచి టీమిండియాకు తిరిగి వచ్చిన రోహిత్, డే-నైట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. ఆపై బ్రిస్బేన్‌లో కూడా అతని బ్యాట్ పని చేయలేదు. మెల్‌బోర్న్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాడ్ షాట్లు ఆడి ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

నేను సెలెక్టర్‌గా ఉంటే, రోహిత్‌ను తొలగిస్తాను: మార్క్ వా

రోహిత్ ఈ ప్రదర్శన చూసి డ్రాప్ లేదా రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టర్ ఫాక్స్‌తో మాట్లాడిన మార్క్ వా, మెల్‌బోర్న్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైతే తాను కూడా అలాగే చేసి ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. “నేను సెలెక్టర్‌గా ఉంటే.. అతను రెండవ ఇన్నింగ్స్‌లో (మెల్‌బోర్న్ టెస్ట్) కూడా పరుగులు చేయకపోతే, సిరీస్ డిసైడ్ కోసం సిడ్నీకి వెళ్లాల్సి ఉంటుంది. వెంటనే నేను ‘రోహిత్, మీకు ధన్యవాదాలు, మీ సేవలు ఇక చాలు, మీరు గొప్ప ఆటగాడిగా ఉన్నారు. కానీ మేం జస్ప్రీత్ బుమ్రాను SCG టెస్ట్‌కు కెప్టెన్‌గా చేస్తున్నాం. మీ కెరీర్ ఇక్కడితో ముగుస్తుంది’ అంటూ షాక్ ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాలో భారత కెప్టెన్ ఘోర వైఫల్యం..

దీంతో డిసెంబరు 30న మెల్‌బోర్న్ టెస్టు చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ ఎలా రాణిస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ, అందరి అంచనాలను వమ్ము చూస్తూ మరోసారి నేను ఇంతే అంటూ కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. టీమ్ ఇండియా గెలవాలంటే 330 పరుగులకు పైగా చేయాల్సి ఉంది. ఇంత భారీ స్కోర్ ఛేదించడంలో విఫలమైన ఈ ముగ్గురు బ్యాటర్లను రిటైర్మెంట్ చేయాలని ఫ్యాన్స్, మాజీ క్రికటర్లు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 70 బంతులు మాత్రమే క్రీజులో నిలువగలిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..