IND vs AUS: కుప్పకూలిన టీమిండియా టాపార్డర్‌..! కేవలం 45 పరుగులకే..

భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్, హేజిల్‌వుడ్ విజృంభించడంతో భారత బ్యాటింగ్ కుప్పకూలింది.

IND vs AUS: కుప్పకూలిన టీమిండియా టాపార్డర్‌..! కేవలం 45 పరుగులకే..
Rohit And Virat

Updated on: Oct 19, 2025 | 1:22 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ మొదలైపోయింది. పెర్త్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ప్రారంభం అయింది. అయితే కేవలం వన్డే సిరీస్‌ కోసం ఇంత హైప్‌ ఎందుకో మీ అందరికీ తెలిసిందే. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ చాలా కాలం తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగాడమే అందుకు కారణం. అంతగా ఎదురుచూస్తే అందర్ని నిరాశపరుస్తూ రోహిత్‌, కోహ్లీ దారుణంగా విఫలం అయ్యారు. రోహిత్‌ 8 పరుగులు చేసి అవుట్‌ కాగా కోహ్ల డకౌట్‌గా వెనుదిరిగాడు.

వీరిద్దరే కాదు.. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు సైతం దారుణంగా విఫలం అయ్యారు. మొత్తం తొలి వన్డేలో టీమిండియా టాపార్డర్‌ పెయిల్‌ అయింది. కేవలం 45 పరుగులకే నాలుగు టాప్‌ క్లాస్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తమ నిర్ణయం కరెక్ట్‌ అని నిరూపించింది. ఆసీస్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, జోస్‌ హెజల్‌వుడ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

మధ్యలో వర్షం అంతరాయం కలిగించినా.. ఆసీస్‌ బౌలింగ్‌లో పదును తగ్గలేదు. వర్షం టీమిండియా బ్యాటింగ్‌ను రక్షించనూ లేదు. మొత్తంగా 45 పరుగులకు టీమిండియా నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో హెజల్‌వుడ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ తొలి బంతికి విరాట్‌ కోహ్లీ అవుట్‌సైడ్‌ ది ఆప్‌ స్టంప్‌ బంతిని వెంటాడి.. కవర్‌ డ్రైవ్‌ ఆడే క్రమంలో పాయింట్‌లో క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ 10, శ్రేయస్‌ అయ్యర్‌ 11 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. ఇక ఆశలన్నీ మిడిల్‌ ఆర్డర్‌లో అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌ పైనే ఉన్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి