IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌కు ముందే ఆస్ట్రేలియాకు బ్యాడ్ న్యూస్.. గాయపడిన స్టార్ ప్లేయర్..

|

Dec 03, 2024 | 3:48 PM

Pink Ball Test: రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గాయంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో పింక్ బాల్ టెస్ట్‌లో ఆసీస్‌ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది.

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌కు ముందే ఆస్ట్రేలియాకు బ్యాడ్ న్యూస్.. గాయపడిన స్టార్ ప్లేయర్..
Ind Vs Aus Steve Smith
Follow us on

Steve Smith Injury Scare For Australia: అడిలైడ్‌లో జరగనున్న డే-నైట్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. దీంతో కీలకమైన పింక్ బాల్ టెస్ట్‌లో ఇబ్బంది పడేలా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో గాయపడడంతో స్మిత్ మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అడిలైడ్ టెస్టు డిసెంబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో, అంతకు ముందు స్మిత్ గాయపడటం ఆస్ట్రేలియా దృక్కోణం నుంచి శుభవార్త కాదని తెలుస్తోంది. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు కీలకంగా పేరుగాంచిన సంగతి తెలిసిందే.

స్మిత్ వేలికి గాయం..

నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్మిత్ వేలికి గాయమైంది. మార్స్ లాబుస్చాగ్నే అతనికి త్రో డౌన్ ఇస్తున్న సమయంలో ఇది జరిగింది. గాయపడిన వెంటనే స్మిత్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత అతనికి నెట్స్‌లో సమయం గడపడం కష్టంగా మారింది. దీంతో వెంటనే మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.

స్మిత్ గాయం పరిస్థితి తెలియలేదు..

మీడియా నివేదికల ప్రకారం, నెట్స్ నుంచి నిష్క్రమించిన స్మిత్ గాయాన్ని ఫిజియో పరిశీలించారు. అతని గాయం ఎంత తీవ్రంగా ఉందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్లకు గాయం కావడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా కంగారూ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సైడ్ స్ట్రెయిన్ కారణంగా అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఈ ఫాస్ట్ బౌలర్ సేవలను పొందడం లేదు.

ఇవి కూడా చదవండి

పింక్ బాల్ టెస్ట్ గురించి స్మిత్ ఏమన్నాడంటే?

గాయపడక ముందు, స్టీవ్ స్మిత్ పింక్ బాల్‌తో టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం గురించి ప్రకటన ఇచ్చాడు. రెడ్ బాల్‌తో పోలిస్తే పింక్ బాల్ ఆడే సమయంలో ఎక్కువ దృష్టి పెట్టాలంటూ చెప్పుకొచ్చాడు. ఈ బంతిని అంచనా వేయడం కష్టం. సీమ్, స్వింగ్ కారణంగా గులాబీ బంతికి వ్యతిరేకంగా బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదంటూ తెలిపాడు.

డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్నాయి. భారత శిబిరం నుంచి శుభవార్త ఏమిటంటే, గాయాల ఆందోళన లేదు. రోహిత్ శర్మ పునరాగమనంతో జట్టు బలం పెరిగింది. భారత కెప్టెన్ ఏ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..