IND vs AUS: ఆసీస్‌కు ఎదురుదెబ్బ.. రెండో టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న డేవిడ్‌ వార్నర్‌! అసలేమైందంటే?

భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే నాగ్‌పూర్‌ టెస్టులో ఘోర పరాజయం పాలైన ఆస్ట్రేలియా ఢిల్లీ టెస్టులోనూ ఢీలా పడింది. భారత బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 263 పరుగులకు కుప్పుకూలింది.

IND vs AUS: ఆసీస్‌కు ఎదురుదెబ్బ.. రెండో టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న డేవిడ్‌ వార్నర్‌! అసలేమైందంటే?
David Warner

Updated on: Feb 18, 2023 | 9:59 AM

భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే నాగ్‌పూర్‌ టెస్టులో ఘోర పరాజయం పాలైన ఆస్ట్రేలియా ఢిల్లీ టెస్టులోనూ ఢీలా పడింది. భారత బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 263 పరుగులకు కుప్పుకూలింది. ఇప్పుడు ఆ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ రెండో టెస్టు మధ్యలో అర్ధాంతరంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతని ప్లేసులో మాథ్యూ రేన్‌షా ఫీల్డింగ్‌కు వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. రెండో టెస్టు మొదటి రోజు ఆటలో వార్నర్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మిగిలిన నాలుగు రోజుల మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకే అతనికి బదులు కంకషన్ సబ్ స్టిట్యూట్‌గా మాథ్యూ రేన్ షా ఆడనున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనర్ వార్నర్ 44 బంతులాడి 15 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సిరాజ్ బౌలింగ్ లో అనుహ్యంగా వచ్చిన బౌన్సర్లను వార్నర్ సరిగా ఎదుర్కొనలేకపోయాడు. ఈనేపథ్యంలో ఓ బంతి అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకుని డేవిడ్‌ మోచేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన వార్నర్.. ఫిజియోతో ట్రీట్ మెంట్ తీసుకుని తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు.

ఆ తర్వాత కూడా మరి కొన్ని బౌన్సర్లు వార్నర్‌ హెల్మెట్ కు బలంగా తగిలాయి. గాయమైనా సరే బ్యాటింగ్ చేసిన వార్నర్.. చివరకు షమీ బౌలింగ్‌ లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అయితే ఇన్నింగ్స్‌ మధ్యలో వార్నర్‌కు కంకషన్‌ టెస్టు చేశారు ఫిజియో. ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న టైంలోనూ ఫీల్డింగ్‌కు రాలేదు వార్నర్‌. అయితే బౌన్సర్ల వల్ల వార్నర్ అస్వస్థతకు లోనయ్యాడని ఆ జట్టు ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు. హెల్మెట్ కు పలుమార్లు బలంగా బంతి తగలడంతో వార్నర్ వాంతులు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతని స్థానంలో మాథ్యు రేన్ షా బరిలోకి దిగాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..