IND vs AUS: బోర్డర్- గవాస్కర్ సిరీస్.. భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు

|

Oct 25, 2024 | 11:26 PM

ఈ ఏడాది ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ సిరీస్ చరిత్రలో తొలిసారి 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో టీమిండియా రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌కు వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరాలంటే ఈ సిరీస్‌ ఎంతో కీలకం.

IND vs AUS: బోర్డర్- గవాస్కర్ సిరీస్.. భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు
India Vs Australia
Follow us on

రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ పుణె వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ఓ కీలక ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం (అక్టోబర్ 25) రాత్రి ప్రకటించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మొత్తం 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. అలాగే ఆస్ట్రేలియా టూర్ (బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ)లో టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు టెస్ట్ టీమ్‌ లోనూ చోటు దక్కింది. అయితే గాయం నుంచి కోలుకోలేకపోవడంతో స్టార్ పేసర్ మహ్మద్‌ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరంగా ఉండిపోయాడు.

భారత్‌కు ముఖ్యమైన సిరీస్

ఈ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ మొత్తం 21 మందిని ఎంపిక చేసింది. ఈ 21 మంది ఆటగాళ్లలో 18 మంది ఆటగాళ్లు ప్రధాన జట్టులో ఉన్నారు. కాబట్టి ముగ్గురు క్రికెటర్లు రిజర్వ్‌లో ఉన్నారు. రిజర్వ్ ఆటగాళ్లలో ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్‌లకు అవకాశం కల్పించారు. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్‌లు టెస్టు క్రికెట్‌లో తొలిసారి ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్

  • మొదటి మ్యాచ్- నవంబర్ 22 నుండి 26 వరకు- పెర్త్.
  • రెండవ మ్యాచ్- డిసెంబర్ 6 నుండి 10 వరకు- అడిలైడ్ ఓవల్, (డే-నైట్).
  • మూడవ మ్యాచ్- డిసెంబర్ 14 నుండి 18 వరకు – గబ్బా
  • నాలుగో మ్యాచ్- 26 నుండి 30 డిసెంబర్- మెల్బోర్న్.
  • ఐదవ మ్యాచ్- జనవరి 3 నుండి 7 వరకు- సిడ్నీ.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీం ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ( వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

రిజర్వ్‌లు:

ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..