IND Vs AUS: ఆఖరి సమరం.. టీమిండియా జట్టులో మార్పులు.. ఆసీస్‌కు ముచ్చెమటలు..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని నాలుగో టెస్టు మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదికైంది. ఆస్ట్రేలియా, భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

IND Vs AUS: ఆఖరి సమరం.. టీమిండియా జట్టులో మార్పులు.. ఆసీస్‌కు ముచ్చెమటలు..
India Vs Australia

Updated on: Mar 09, 2023 | 9:25 AM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని నాలుగో టెస్టు మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదికైంది. ఆస్ట్రేలియా, భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొదటి మూడు మ్యాచ్‌లకు తయారు చేసిన స్పిన్ పిచ్‌లకు భిన్నంగా ఈ నాలుగో మ్యాచ్‌కు పిచ్‌ను రెడీ చేశారు క్యూరేటర్లు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఆఖరి సమరానికి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతుంటే.. టీమిండియా మాత్రం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మహమ్మద్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి.. అతడి స్థానంలో షమీని తుది జట్టులోకి తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్.

ఇరు జట్లూ కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని సర్వశక్తులు ఒడ్డిస్తున్నాయి. మూడో టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో.. నాలుగో టెస్టులోనూ సేమ్ సీన్ రిపీట్ చేసి సిరీస్ సమం చేయాలని ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి.. అటు సిరీస్.. ఇటు డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్‌.. రెండింటిని ఖరారు చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరి ఈ ఆఖరి పోరాటంలో గెలుపెవరిదో వేచి చూడాలి..

భారత్(ప్లేయింగ్ 11): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, చతీశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్

ఆస్ట్రేలియా(ప్లేయింగ్ 11): స్టీవ్ స్మిత్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నాస్ లబూషేన్, పీటర్ హ్యాండ్స్‌కంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, టాడ్ ముర్ఫీ, మ్యాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియాన్