Watch Video: వావ్.. సూపర్ బౌలింగ్ బ్రో.. కళ్లు చెదిరే బంతికి ఎగిరిపడిన వికెట్.. వైరల్ వీడియో..
IND vs AUS 4th Test: అహ్మదాబాద్ టెస్టు తొలి రోజు ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. అయితే, పీటర్ హ్యాండ్‌కాంబ్ వికెట్ వీడియో మాత్రం తెగ వైరలవుతోంది.
Mohammed Shami: అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం సాధించింది. భారత్ బౌలర్ల ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే, తొలిరోజు ఆటలో మహ్మద్ షమీ తన అద్భుతమైన బంతితో పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను బౌల్డ్ చేశాడు. ఈ భారత ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాకు చెందిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని తన బంతితో షాక్‌కి గురిచేశాడు. ఈ అద్భుతమైన బంతికి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టాడు. బంతి వేగానికి వికెట్ చాలా సేపు గాలిలో ఎగురుతూ వెళ్లినట్లు వీడియో చూడొచ్చు. ఈ అద్భుతమైన బంతిని చూసిన ఆస్ట్రేలియా బ్యాటర్ కూడా అవాక్కయ్యాడు. నెటిజన్లు కూడా ఇలాంటి బంతి అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మహమ్మద్ షమీ అద్భుతమైన బంతి వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అహ్మదాబాద్ టెస్టు తొలిరోజు హ్యాండ్స్‌కాంబ్‌లానే మహ్మద్ షమీ మార్నస్ లాబుషెన్ స్టంప్‌లను చెదరగొట్టాడు. షమీ ఇన్‌స్వింగ్‌ను మిస్ అవ్వడంతో హ్యాండ్స్‌కాంబ్ వికెట్ కోల్పోయాడు. బంతి అతని బ్యాట్ లోపలి అంచుని తీసుకొని లెగ్ స్టంప్‌ను పడగొట్టింది.
నిర్ణయాత్మకంగా అహ్మదాబాద్ టెస్టు..
As good as it gets! ??@MdShami11 uproots the off-stump to dismiss Handscomb for 17! ??
Australia 170/4.
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/2hXFYhvslW
— BCCI (@BCCI) March 9, 2023
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ చివరి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారనుంది. ఇక్కడ ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తోంది.
భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా..
?.?.?.?.?.? ?@MdShami11 sends back Labuschagne to scalp the second wicket for #TeamIndia ?
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/LT3ao2kFBk
— BCCI (@BCCI) March 9, 2023
ఆస్ట్రేలియా మొదటి రోజు ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో జట్టు ఓపెనింగ్ జోడి మొదటిసారి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని చేసింది. ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఇక్కడ ట్రావిస్ హెడ్ (32)ను అశ్విన్ ఔట్ చేశాడు. ఇది జరిగిన వెంటనే మార్నస్ లబుషెన్ (3) కూడా పెవిలియన్ చేరాడు. ఇక్కడి నుంచి ఖవాజా స్మిత్‌తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి ఆరంభం అందించాడు. 151 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ (38) జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆపై పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (17) మొత్తం 170 వద్ద మహ్మద్ షమీకి బలయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..