IND vs AUS: టీమిండియాను తిప్పేసిన నాథన్‌ లియోన్‌.. 8 వికెట్లతో రికార్డు స్పెల్.. మూడో టెస్టులో ఓటమి ముంగిట భారత జట్టు

మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 109 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక మూడో టెస్టులో భారత జట్టు విజయం సాధించాలంటే బౌలర్లు అద్భుతం చేయాల్సిందే.

IND vs AUS: టీమిండియాను తిప్పేసిన నాథన్‌ లియోన్‌.. 8 వికెట్లతో రికార్డు స్పెల్.. మూడో టెస్టులో ఓటమి ముంగిట భారత జట్టు
Ind Vs Aus

Updated on: Mar 02, 2023 | 6:14 PM

వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచి ఊపుమీదనున్న టీమిండియా మూడో టెస్టులో మాత్రం ఓటమి ముంగిట నిలిచింది. ఇండోర్‌ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 163 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 76 పరుగుల స్పల్ప విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛెతేశ్వర్‌ పుజారా (59) అర్ధ శతకంతో టీమిండియాను ఆదుకున్నాడు. ఒకవేళ పుజారా కూడా ఆడకపోయి ఉంటే భారత్‌ ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిపాలయ్యేది. శ్రేయస్‌ అయ్యర్‌ (26; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా దురదృష్టవశాత్తూ ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ (12), శుభ్‌మన్‌ గిల్ (2), విరాట్‌ కోహ్లీ (13), రవీంద్ర జడేజా (4), కేఎస్‌ భరత్‌ (3), అశ్విన్‌ (16) పూర్తిగా నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్లలో నాథన్‌ లియోన్‌ ఎనిమిది వికెట్లతో మరోసారి భారత జట్టుకు చుక్కలు చూపించాడు. మిచెల్ స్టార్క్, కునెమన్ తలో వికెట్ తీశారు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 109 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక మూడో టెస్టులో భారత జట్టు విజయం సాధించాలంటే బౌలర్లు అద్భుతం చేయాల్సిందే.

అంతుకుముందు ఓవర్‌ నైట్‌ స్కోరు 156/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ మొదటి గంటసేపు నిలకడగానే ఆడింది. అయితే ఉమేశ్‌, అశ్విన్‌ల విజృంభణతో వరుసగా వికెట్లు కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో హాండ్స్‌కాంబ్‌ (19) శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరగా, గ్రీన్‌న్‌ (21)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు ఉమేశ్‌. కాసేపటికే మిచెల్ స్టార్క్‌ (1)ను కూడా క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అలెక్స్‌ కేరీ (3)ని అశ్విన్‌ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఉమేశ్ వేసిన మరుసటి ఓవర్‌లో టాడ్‌ మార్ఫీ (0) బౌల్డ్ అయ్యాడు. ఇక నాథన్‌ లియోన్‌ (5)ని అశ్విన్‌ పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..