Ind vs Aus: ముగిసిన తొలి రోజు ఆట.. ఆసీస్ స్కోరు ఎంతంటే?

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న అడిలైడ్ డే-నైట్ టెస్టు తొలి రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మొదట భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరఫున నితీష్ (942), రాహుల్ (37), గిల్ (31) సత్తాచాటారు.

Ind vs Aus: ముగిసిన తొలి రోజు ఆట.. ఆసీస్ స్కోరు ఎంతంటే?
Ind Vs Aus
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 06, 2024 | 7:13 PM

భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ డే నైట్ టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 180 పరుగులకే ఆలౌటైంది.  ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 86 పరుగుల వద్ద ఆట ముగిసింది. ప్రస్తుతం మార్నస్ లాబుషానే 20 పరుగులతో, నాథన్ మెక్‌స్వీనీ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు 62 పరుగుల భాగస్వామ్యం ఉంది. రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయింది, ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియాకు శుభారంభం లభించలేదు. జైస్వాల్ మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. దీంతో పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌ల మధ్య రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. స్టార్క్ వారిద్దరి భాగస్వామాన్ని విడదీశాడు. ఓపెనర్ రాహుల్ 37 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. రాహుల్ అవుటైన వెంటనే టీమ్ ఇండియా ప్లేయర్ల వికెట్లు వెంట వెంటనే పడ్డాయి. 4వ  నెంబర్‌లో వచ్చిన విరాట్ కోహ్లి 7 పరుగులు చేసి ఔట్ కాగా, శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగుల వద్ద ఔటయ్యాడు. ఒక దశలో భారత్ స్కోరు ఒక వికెట్‌కు 69 పరుగులు కాగా, కాసేపటికి ఐదు వికెట్లకు 87 పరుగులు చేసింది. అంటే 18 పరుగులకే భారత్ మరో నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. నితీష్ రెడ్డితో కలిసి అశ్విన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించి ఏడో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ మళ్లీ అటాక్ చేసిన స్టార్క్.. అశ్విన్ వికెట్ పడగొట్టి ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. ఆఖర్లో 54 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన నితీశ్.. స్టార్క్‌కు వికెట్ ఇచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి