IND vs AFG ICC World Cup 2023 Highlights: ఆఫ్ఘాన్‌ను చిత్తు చేసిన భారత్.. సత్తా చాటిన రోహిత్, కోహ్లీ..
India vs Afghanistan, ICC world Cup 2023 Highlights: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో భారత్ చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా కేవలం 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ సాధించి 2023 ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో విజయాన్ని అందించాడు.

IND vs AFG, ICC world Cup 2023 Highlights: టీమిండియా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా కేవలం 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ బౌలింగ్‌లో బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ సాధించి 2023 ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో విజయాన్ని అందించాడు. రోహిత్‌తో పాటు విరాట్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. కింగ్ కోహ్లీ 55 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ భారత్‌కు 273 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆఫ్ఘనిస్థాన్ తరపున కెప్టెన్ షాహిదీ 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, ఒమర్‌జాయ్ 62 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. బర్త్ డే బాయ్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు.
ICC ODI వరల్డ్ కప్ 2023లో ఈరోజు టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. అంతకుముందు భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
LIVE Cricket Score & Updates
-
అసలు పోరుకు ముందు ఘనమైన విజయం..
టీమిండియా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా కేవలం 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ బౌలింగ్‌లో బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ సాధించి 2023 ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో విజయాన్ని అందించాడు. రోహిత్‌తో పాటు విరాట్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. కింగ్ కోహ్లీ 55 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగాడు.
-
ఫొటో ఆఫ్ ది డే..
Naveen and Virat #India #Afghanistan #INDvsAFG #AFGvsIND #Bharat #ICCCricketWorldCup #CWC23 #CWC2023 #Cricket #WorldCup #ICCWorldCup #WorldCup2023 #RohitSharma𓃵 #ViratKohli𓃵 #ViratKohli #RashidKhan #NaveenUlHaq pic.twitter.com/mY2wtx2jQD
— Neha (@ind_finity) October 11, 2023
-
-
రోహిత్ ఔట్..
సెంచరీ హీరో రోహిత్ 131 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 27 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగులు సాధించింది.
-
ఇషాన్ ఔట్..
ఎట్టకేలకు ఆఫ్ఘాన్ బౌలర్లు తొలి వికెట్ సాధించారు. హాఫ్ సెంచరీకి చేరువలో ఇషాన్ కిషన్ (47 పరుగులు)ను డేంజరస్ బౌలర్ రషీద్ పెవిలియన్ చేరాడు.
-
ఆగని రోహిత్ తుఫాన్ ఇన్నింగ్స్..
14 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 125 పరుగులు పూర్తి చేసింది. రోహిత్ 88 పరుగులు, ఇషాన్ 30 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
-
9 ఓవర్లకు 87 పరుగులు..
9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 87 పరుగులు పూర్తి చేసింది. రోహిత్ 71, ఇషాన్ 10 పరుగులతో నిలిచారు.
-
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు..
554* – రోహిత్ శర్మ
553 – క్రిస్ గేల్
476 – షాహిద్ అఫ్రిది
398 – బ్రెండన్ మెకల్లమ్
383 – మార్టిన్ గప్టిల్
-
7 ఓవర్లలో 64 పరుగులు..
7 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా 64 పరుగులు పూర్తి చేసింది.
-
ప్రపంచ కప్‌లలో భారత్ తరపున అత్యధిక పరుగులు..
2278 – సచిన్ టెండూల్కర్
1115 – విరాట్ కోహ్లీ
1009* – రోహిత్ శర్మ
1006 – సౌరవ్ గంగూలీ
860 – రాహుల్ ద్రవిడ్
-
ప్రపంచకప్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లో 1,000 పరుగులు..
19 – డేవిడ్ వార్నర్
19 – రోహిత్ శర్మ
20 – సచిన్ టెండూల్కర్
20 – ఎబి డివిలియర్స్
21 – సర్ వివియన్ రిచర్డ్స్
21 – సౌరవ్ గంగూలీ
-
1000 పరుగుల మైలురాయిని చేరిన రోహిత్..
రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
-
4 ఓవర్లకు 23 పరుగులు
బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ 17, ఇషాన్ 4 పరుగులతో దూకుడుగా ఆడుతున్నారు.
-
టీమిండియా ముందు టార్గెట్ 273
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ భారత్‌కు 273 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆఫ్ఘనిస్థాన్ తరపున కెప్టెన్ షాహిదీ 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, ఒమర్‌జాయ్ 62 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. బర్త్ డే బాయ్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు.
-
కుల్డీప్ అద్భుత క్యాచ్.. 8వ వికెట్ డౌన్..
బుమ్రా వేసిన బంతిని గాల్లోకి తరలించిన రషీద్.. అంతా సిక్స్ వెళ్తుందని ఆశించారు. కానీ, కుల్దీప్ అద్భుత క్యాచ్‌తో రషీద్ పెవిలియన్ చేరాడు. దీంతో 261 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది ఆఫ్గాన్.
-
5 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘాన్..
44 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘాన్ టీం 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. కుల్డీప్ అద్బుతమైన బంతితో ఆఫ్గాన్ కెప్టెన్‌ను పెవిలియన్ చేర్చాడు.
-
200లు దాటిన స్కోర్..
భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని ఆఫ్గాన్ బ్యాటర్లు స్కోర్‌ను 200 దాటించారు. 37 ఓవర్లు ముగిసే సరికి కేవలం 4 వికెట్లను మాత్రమే కోల్పోయారు. దీంతో ఈ మ్యాచ్‌లో టార్గెట్ 300లకు చేరేలా కనిపిస్తోంది.
-
4వ వికెట్ డౌన్..
100 సెంచరీ భాగస్వామ్యంతో దూసుకపోతోన్న ఆఫ్ఘాన్ జోడీని హార్దిక్ పాండ్యా విడగొట్టాడు. దీంతో 183 పరుగుల వద్ద ఆ జట్టు నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
-
డేంజర్‌గా మారిన హష్మతుల్లా ఒమర్జాయ్ జోడీ..
హష్మతుల్లా ఒమర్జాయ్ జోడీ 90కి పైగా పరుగుల భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు. ఈ క్రమంలో భారీ స్కోర్‌పై ఆఫ్ఘాన్ జట్టు కన్నేసింది. మరోవెపు వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
-
22 ఓవర్లకు ఆఫ్ఘాన్ స్కోర్..
22 ఓవర్లు ముగిసే ఆఫ్ఘాన్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు సాధించింది.
-
16 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్..
16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. బుమ్రా, శార్దుల్, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.
-
2వ వికెట్ కోల్పోయిన ఆఫ్ఠాన్..
హార్దిక్ బౌలింగ్‌లో ఆఫ్గాన్ టీం 2వ వికెట్ కోల్పోయింది. గుర్బాజ్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
-
వికెట్ల కోసం భారత బౌలర్ల తంటాలు..
వికెట్ల కోసం భారత బౌలర్లు తంటాలు పడుతున్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘాన్ టీం ఒక వికెట్ కోల్పోయి 58 పరుగులు చేసింది.
-
తొలి వికెట్ కోల్పోయిన ఆష్ఘాన్..
ఎట్టకేలకు టీమిండియాకు వికెట్ దక్కింది. 6.4 ఓవర్లో బుమ్రా బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన జద్రాన్ (22) కీపర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘాన్ ఒక వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది.
-
5 ఓవర్లకు ఆఫ్ఘాన్ స్కోర్..
5 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆఫ్ఘాన్ టీం వికెట్ నష్టపోకుండా 24 పరుగులు పూర్తిచేసింది. గుర్బాజ్ 1, జర్దాన్ 17 పరుగులతో నిలిచారు.
-
ఇరుజట్లు:
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
-
IND vs AFG Live Score: ఆఫ్ఘాన్‌తో పోరుకు సిద్ధం.. మరికొద్దిసేపట్లో టాస్..
ICC ODI వరల్డ్ కప్ 2023లో ఈరోజు టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. అంతకుముందు భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Published On - Oct 11,2023 1:11 PM




