CWC 2023, ENG vs BAN Preview: ఓటమితో ఇంగ్లండ్.. విజయంతో బంగ్లాదేశ్.. ఇంగ్లీషోళ్లకు మరోసారి షాక్ తగిలేనా?
England vs Bangladesh Predicted Playing 11: హిమాలయ కొండలలో ఉన్న ధర్మశాలలోని ఈ స్టేడియం చాలా అందంగా ఉంటుంది. ఇది ఫాస్ట్ బౌలర్లకు చాలా సహాయాన్ని అందిస్తుంది. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 156 పరుగులు చేయడంతో ఇక్కడ బౌలర్ల సహకారం పుష్కలంగా ఉంది. అయితే, ఈ మైదానం అవుట్‌ఫీల్డ్‌పై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే, ఐసీసీ దీనికి సాధారణ రేటింగ్ ఇచ్చింది.
England vs Bangladesh Predicted Playing 11: గత ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ (England Cricket Team) జట్టుకు ఈ ప్రపంచకప్‌లో శుభారంభం దక్కలేదు. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే, ఇప్పుడు ఇంగ్లాండ్ తన రెండవ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో రేపు అంటే అక్టోబర్ 10వ తేదీన ఆడనుంది. ఈ టోర్నీని బంగ్లాదేశ్ విజయంతో ప్రారంభించింది. బంగ్లాదేశ్ ధర్మశాల గడ్డపైనే ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. రికార్డులు, ఆటగాళ్ల సామర్థ్యాల కారణంగా ఈ మ్యాచ్‌లో గెలవడానికి ఇంగ్లండ్ గట్టి పోటీదారుగా ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం.
ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 4 మ్యాచ్‌లు జరగగా, ఇందులో ఇరు జట్లు తలో 2 మ్యాచ్‌లు గెలిచాయి. 2007, 2019 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్ బంగ్లాదేశ్‌ను ఓడించగా, 2011, 2015 ప్రపంచకప్‌లలో బంగ్లాదేశ్ గెలిచింది. వన్డే ఫార్మాట్ గురించి చెప్పాలంటే, ఇక్కడ ఇంగ్లాండ్‌దే పైచేయిగా నిలిచింది. ఇప్పటి వరకు జరిగిన మొత్తం 24 వన్డేల్లో ఇంగ్లండ్ 19, బంగ్లాదేశ్ 5 గెలిచాయి.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
ఇంగ్లండ్:
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్, కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
బంగ్లాదేశ్:
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, తంజీద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం.
పిచ్, వాతావరణ సమాచారం..
View this post on Instagram
హిమాలయ కొండలలో ఉన్న ధర్మశాలలోని ఈ స్టేడియం చాలా అందంగా ఉంటుంది. ఇది ఫాస్ట్ బౌలర్లకు చాలా సహాయాన్ని అందిస్తుంది. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 156 పరుగులు చేయడంతో ఇక్కడ బౌలర్ల సహకారం పుష్కలంగా ఉంది. అయితే, ఈ మైదానం అవుట్‌ఫీల్డ్‌పై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే, ఐసీసీ దీనికి సాధారణ రేటింగ్ ఇచ్చింది.
మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?
View this post on Instagram
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 10 గంటలకు పడనుంది. స్టార్ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌ని టీవీలో చూడవచ్చు. ఇది Disney+Hotstar ఓటీటీలోనూ ప్రసారం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..