Kohli vs Gambhir: కోహ్లి బ్యాటింగ్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు.. షాక్‌లో ఫ్యాన్స్.. ఏమన్నాడంటే?

Gautam Gambhir Praises Virat Kohli: ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి జట్టుకు చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ జట్టు సులువైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా విరాట్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య విభేదాల వార్తలు తరచుగా తెరపైకి వస్తుంటాయి. కానీ, ఈసారి విరాట్ తన ఇన్నింగ్స్‌తో గౌతమ్ గంభీర్‌ను తన అభిమానిగా మార్చుకున్నాడు.

Kohli vs Gambhir: కోహ్లి బ్యాటింగ్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు.. షాక్‌లో ఫ్యాన్స్.. ఏమన్నాడంటే?
Gambhir On Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Oct 09, 2023 | 8:36 PM

Gautam Gambhir Praises Virat Kohli: వన్డే ప్రపంచకప్‌ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు టోర్రీలో ఘనంగా అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన కనిపించింది. అయితే టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్ దారుణ పరాజయం పాలయ్యారు. ఒకానొక సమయంలో భారత్ స్కోరు రెండు పరుగులకే మూడు వికెట్లు ఉండగా, ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. ఇక్కడి నుంచి విరాట్ కోహ్లి 85 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, కేఎల్ రాహుల్ 97 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా విజయతీరాలకు చేర్చారు. విరాట్‌ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అభిమానులు, క్రికెట్ పండితులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా తన స్పందనను తెలియజేశాడు. దీంతో గంభీర్ చర్చనీయాంశంగా మారాడు.

విరాట్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన గౌతమ్ గంభీర్..

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి జట్టుకు చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ జట్టు సులువైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా విరాట్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య విభేదాల వార్తలు తరచుగా తెరపైకి వస్తుంటాయి. కానీ, ఈసారి విరాట్ తన ఇన్నింగ్స్‌తో గౌతమ్ గంభీర్‌ను తన అభిమానిగా మార్చుకున్నాడు.

గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే?

View this post on Instagram

A post shared by ICC (@icc)

స్టార్ స్పోర్ట్స్‌లో గంభీర్ మాట్లాడుతూ, “పెద్ద టోటల్‌ని ఛేజ్ చేసేటప్పుడు, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసం ఉండాలి. బ్యాటింగ్ రోటేట్ చేస్తుండాలి. విరాట్ కోహ్లీ ఈ పని 100 శాతం చేసి చూపించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న యువ ఆటగాళ్లు ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను రుచి చూపించాడు. ఓవర్ల మధ్య స్ట్రైక్‌ను రోటేట్ ఎంత ముఖ్యమో వారు విరాట్ నుంచి నేర్చుకుంటారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

యువ ఆటగాళ్లకు సలహాలు..

గౌతం గంభీర్ మాట్లాడుతూ, “T20 క్రికెట్ వచ్చినప్పటి నుంచి, చాలా మంది యువకులు మైదానం వెలుపలకు బంతిని కొట్టాలని కోరుకుంటారు. కానీ, ODI క్రికెట్‌లో అది అంత సులభం కాదు. ODI క్రికెట్‌లో ఎక్కువగా స్ట్రైక్‌ని రోటేట్ చేయడంపై దృష్టి పెట్టాలి. ఈ విషయంలో విరాట్ కోహ్లీ చాలా మంచివాడు’ అంటూ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..