AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-పాక్ మ్యాచ్: అందరినీ ఆకట్టుకున్న ఈ జంట ఎవరంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో కోహ్లీ సేన మరో గెలుపును ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు దాయాది దేశాల నుంచే కాకుండా మిగిలిన దేశాల అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే వారందరిలో కెనడాకు చెందిన ఓ జంట ఇరు దేశాల అభిమానుల మనసులను గెలుచుకుంది. భారత్‌- పాక్ దేశాల జెర్సీలను కలిపి కుట్టించుకున్న డ్రెస్ వేసుకొని ఈ […]

భారత్-పాక్ మ్యాచ్: అందరినీ ఆకట్టుకున్న ఈ జంట ఎవరంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2019 | 3:47 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో కోహ్లీ సేన మరో గెలుపును ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు దాయాది దేశాల నుంచే కాకుండా మిగిలిన దేశాల అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే వారందరిలో కెనడాకు చెందిన ఓ జంట ఇరు దేశాల అభిమానుల మనసులను గెలుచుకుంది. భారత్‌- పాక్ దేశాల జెర్సీలను కలిపి కుట్టించుకున్న డ్రెస్ వేసుకొని ఈ జంట రెండు జట్లకు మద్దతు పలికింది.

ఇక వీరి ఫొటోను లక్ష్మీ కౌల్ అనే ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘ఈ జంటను ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో చూశా. ఇందులో భర్తది పాకిస్తాన్, భార్యది భారత్ అవ్వగా.. ఆ రెండు దేశాల జెర్సీలను కలపి కుట్టించుకొని ధరించారు. వారిద్దరు కెనడియన్స్. ఇంగ్లండ్‌లో ఆటను చూస్తూ.. శాంతికి చిహ్నంగా నిలిచారు’’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఈ ఫొటోపై స్పందిస్తోన్న నెటిజన్లు.. ‘‘ఇరు దేశాల మధ్య జరుగుతున్నది కేవలం ఆటేనని వీరు అందరికి గట్టిగా చెప్పారని’’ ఒకరు కామెంట్ చేయగా.. ‘‘నిన్న ఎవరు గెలిచారనేది అనవసరం. కానీ మనమంతా ఒక్కటేనని వీరు చాటిచెబుతున్నారు’’ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.

Follow Us
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన
భరించలేని ఒళ్ళు, మోకాలి నొప్పులను తగ్గించే పెయిన్ కిల్లర్ ఇవి
భరించలేని ఒళ్ళు, మోకాలి నొప్పులను తగ్గించే పెయిన్ కిల్లర్ ఇవి