ఐసీసీ మహిళల ప్రపంచకప్(ICC Womens World Cup 2022)లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్(Mithali Raj) బ్యాట్ మూగబోయింది. అయితే ప్రపంచ రికార్డు(World Cup Record)ను బద్దలు కొట్టడంలో మాత్రం సత్తా చాటింది. ఈ ప్రపంచ రికార్డు గతంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మహిళా క్రీడాకారిణుల పేరిట సంయుక్తంగా నిలిచింది. తాజాగా భారత కెప్టెన్ మిథాలీ ఈ లిస్టులో అగ్రస్థానికి చేరింది. ఇంతకీ ఆ వరల్డ్ రికార్డ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. అత్యధిక ప్రపంచకప్ ఆడిన మహిళా క్రీడాకారిణికి సంబంధించినది. 39 ఏళ్ల మిథాలీ రాజ్ ప్రస్తుతం పాకిస్థాన్‌తో మైదానంలోకి వచ్చిన వెంటనే అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన ప్లేయర్‌గా మారింది. ఇది ఆమెకు ఆరో ప్రపంచకప్. ఇన్ని ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది.
అయితే, మిథాలీ తన రికార్డు ఆరో ప్రపంచకప్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌తో సత్తా చాటలేకపోయింది. పాకిస్థాన్‌పై 36 బంతులు ఎదుర్కొన్న ఆమె 2 ఫోర్ల సాయంతో 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌కు ఇది శుభారంభం కాదు.
6 ప్రపంచకప్ ఆడిన తొలి మహిళా క్రీడాకారిణి మిథాలీ రాజ్..
టోర్నమెంట్‌లో బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోయిన మిథాలీ.. అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. 2000లో మిథాలీ రాజ్ ప్రపంచకప్ అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి అంటే 2005, 2009, 2013, 2017, ప్రస్తుతం 2022 వరకు తన జర్నీని కొనసాగించింది. ఈ సందర్భంలో, ఆమె న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ, ఇంగ్లాండ్‌కు చెందిన ఎడ్వర్డ్స్ రికార్డులను బద్దలు కొట్టింది. హాక్లీ 1982 నుంచి 2000 మధ్య 5 ప్రపంచ కప్‌లు ఆడింది. ఎడ్వర్డ్స్ 1997 నుంచి 2013 మధ్య 5 ప్రపంచ కప్‌లలో భాగంగా నిలిచింది.
సచిన్ టెండూల్కర్‌తో సమానంగా నిలిచిన మిథాలీ..
మహిళలలో అత్యధిక ప్రపంచకప్‌లు ఆడి 6 ప్రపంచకప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా మిథాలీ రాజ్ సమం చేసింది. 1992లో సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సచిన్ 1996, 1999, 2003, 2007, 2011లో బరిలోకి దిగాడు.