
ICC Under 19 Womens T20 World Cup 2025: భారత మహిళా క్రికెట్ జట్టు మలేషియాపై అద్భుతంగా బౌలింగ్ చేసింది. దీంతో మలేషియా బ్యాటింగ్ ఆర్డర్ పేక ముక్కల్లా కూలిపోయింది. మలేషియా జట్టు కేవలం 22 పరుగులకే తొలి ఐదు వికెట్లు కోల్పోయింది. మలేషియా జట్టు ఇచ్చిన టార్గెట్‌ను టీమ్ ఇండియా కేవలం 17 బంతుల్లోనే టార్గెట్ రీచ్ అయింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మలేషియా బ్యాటర్ నో బాల్ ఔటవ్వడం. ఈ విచిత్ర సంఘటనలో అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మలేషియాకు వ్యతిరేకంగా బౌలింగ్ చేసిన భారత స్పిన్నర్లు విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో మలేషియా బ్యాటర్ నుని ఫారిని సఫ్రీని జోషిత అవుట్ చేసింది. ఆ తర్వాత నాల్గవ ఓవర్లో మలేషియా వికెట్ కీపర్ ఆలియా మధ్య అరుదైన సీన్ చోటు చేసుకుంది. నూర్ అలియా 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయింది. ఆమె ఔట్ అయిన బాల్ నో బాల్ కావడమే పెద్ద విషయం. ఆమె నో బాల్‌పై షాట్ ఆడింది. ఆ తర్వాత పిచ్‌పై పరుగు తీసేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో పరుణికా సిసోడియా ఆమెను రనౌట్ చేసింది.
Aayushi Shukla strikes twice! 💪🏻
Malaysia Women are in deep trouble as #TeamIndia bowlers are on fire! 🔥
📺 Watch LIVE: https://t.co/EXQ91mNtUB#U19WomensT20WConJioStar 👉 #INDWvMASW, LIVE NOW on Disney+ Hotstar! pic.twitter.com/u4HbNO0SbX
— Star Sports (@StarSportsIndia) January 21, 2025
మలేషియా ప్లేయర్ అలియా రనౌట్ అయిన వెంటనే.. తర్వాతి 6 బంతుల్లోనే ఈ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఆయుషి శుక్లా హుస్నాను బౌల్డ్ చేయగా, అదే బౌలర్ సఫికా వికెట్ కూడా పడగొట్టింది. మలేషియా కెప్టెన్ నూర్ డానియా కూడా 1 పరుగు చేసి ఔట్ కాగా, నురిమాన్ హిదయా అవుటైన వెంటనే మలేషియా 10 ఓవర్లకు ముందే 6 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత జట్టుకు పెద్ద కష్టమేమీ కాలేదు. భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..