షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. అండర్ 19 మహిళల విభాగంలో భారత్‌కు ఇదే తొలి ప్రపంచకప్. కాగా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను టీమిండియా గెలవడంలో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన శ్వేత 99 సగటుతో 297 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో చేసిన 92 పరుగులు టోర్నీలో ఆమె అత్యధిక స్కోర్. ఇక బౌలింగ్‌లో లెగ్‌స్పిన్‌తో పర్శవి ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టింది. 6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో జట్టు కప్పు గెలవడంలో ప్రధాన భూమిక పోషించింది. గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్లు తీసిన ఆమె న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో కూడా మూడు వికెట్లు తీసింది. ఇక ఫైనల్‌లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచింది. ఆఫ్ స్పిన్నర్లు మన్నత్ (9), అర్చన (8) కూడా అదరగొట్టారు. పేస్ సంచలనం టైటాస్ సాధు (6) కూడా ఆరంభ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేసింది. ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో బౌలర్ మన్నత్ కశ్యప్. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ఆమె ఆరు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టింది. ఫైనల్లో ఒక వికెట్‌తో రాణించింది.
ఇక ఇప్పటికే సీనియర్ జట్టులో చోటు సంపాదించిన షెఫాలి కూడా ఆల్‌రౌండ్ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టింది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 172 పరుగులు చేసిన షెఫాలీ జట్టుకు అవసరమైన సందర్భాల్లో బంతితో రాణించింది. ఇక తెలంగాణ అమ్మాయి 17 ఏళ్ల త్రిష తన ప్రదర్శనతో మెప్పించింది. 7 మ్యాచ్‌ల్లో 116 పరుగులు చేసింది. అందులో స్కాట్లాండ్‌పై ఓ అర్ధశతకమూ చేసింది. కీలకమైన ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా ఆడింది. పిచ్‌ను అర్థం చేసుకుని, పరిస్థితులకు తగినట్లుగా నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చింది.
Enjoyed watching this moment from the stands. Congratulations Team India @BCCIWomen on making history #INDvENG #U19T20WorldCup pic.twitter.com/xyKIbQ4AxW
— Neeraj Chopra (@Neeraj_chopra1) January 29, 2023
మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..