వన్డే ప్రపంచ కప్ షురూ.. క్రికెట్ లవర్స్‌కు 40 రోజుల పాటు ఫుల్‌ఫీస్ట్.. తొలిపోరుకు సై అన్న ఇంగ్లండ్, కివీస్..

World Cup 2023: ఈ టోర్నమెంట్‌ను హోస్ట్‌గా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీసీసీఐ. అన్ని గ్రౌండ్స్‌నీ, పిచ్‌లను, స్టేడియంలను ఆధునీకరించింది. బౌలర్లకు, బ్యాట్స్‌మెన్‌లకు స్వర్గధామం కానున్నాయి ఇండియన్ పిచ్‌లు. సూపర్‌ఓవర్‌ టై అయినప్పటికీ.. ఎక్స్‌ట్రా సూపర్‌ఓవర్లు వేయించి కూడా క్లియర్‌కట్‌ విక్టరీ డిసైడయ్యేలా రూల్స్ ఉన్నాయంటున్నారు అనలిస్టులు.

వన్డే ప్రపంచ కప్ షురూ.. క్రికెట్ లవర్స్‌కు 40 రోజుల పాటు ఫుల్‌ఫీస్ట్.. తొలిపోరుకు సై అన్న ఇంగ్లండ్, కివీస్..
ప్రపంచకప్ చరిత్రలో మరో రికార్డ్ బద్దలైంది. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (39)లు నమోదయ్యాయి.

Updated on: Oct 04, 2023 | 7:23 PM

World Cup 2023, England vs New Zealand, 1st Match: ఈసారి వన్‌డే వార్ వన్‌సైడేనా.. లేక హోరాహోరీ పోరాటం తప్పదా.. కప్పు కోసం మల్టిపుల్ ఫేవరిట్స్ పోటీ పడతాయా.. ఇంతకీ మెన్‌ ఇన్ బ్లూకున్న విన్నింగ్ ఛాన్సెస్ ఏంటి.. ఇలా ఇన్నాళ్లూ అంతులేని ప్రశ్నలు. కానీ.. కొన్ని గంటలాగితే చాలు.. ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకబోతున్నాయి. వన్‌డే వరల్డ్ కప్ టోర్నీ.. ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు అసలైన పెద్ద పండగ.. రేపే మొదలవబోతోంది.

–ఫస్ట్‌ మ్యాచ్‌తో ఫస్ట్ కిక్ ఇవ్వడానికి రెడీ అంటున్నాయి ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో తొలి పోరు కోసం వామప్‌తో బిజీగా ఉన్నాయి రెండు జట్లు.

ఇవి కూడా చదవండి

–టీమిండియా తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో అడుతుంది. ఇప్పటికే చెన్నై చేరుకుని… రాబోయే నాలుగురోజులూ ఇక్కడే మకాం ఉండబోతున్నాయి ఇండియా, ఆసీస్ జట్లు.

–కానీ.. అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో తలపడే మ్యాచ్ కోసమే… యావత్ క్రికెట్ ప్రపంచం వెయిటింగ్.

–రోహిత్ సేన దగ్గరైతే.. కప్పు మనదేరా అనే ధీమా గట్టిగానే కనిపిస్తోంది.

ఈ టోర్నమెంట్‌ను హోస్ట్‌గా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీసీసీఐ. అన్ని గ్రౌండ్స్‌నీ, పిచ్‌లను, స్టేడియంలను ఆధునీకరించింది. బౌలర్లకు, బ్యాట్స్‌మెన్‌లకు స్వర్గధామం కానున్నాయి ఇండియన్ పిచ్‌లు. సూపర్‌ఓవర్‌ టై అయినప్పటికీ.. ఎక్స్‌ట్రా సూపర్‌ఓవర్లు వేయించి కూడా క్లియర్‌కట్‌ విక్టరీ డిసైడయ్యేలా రూల్స్ ఉన్నాయంటున్నారు అనలిస్టులు.

సో.. ప్రతీ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగి.. క్రికెట్ లవర్స్‌కు ఫుల్‌ఫీస్ట్ ఇచ్చే ఛాన్సుంది. రేపటినుంచి నవంబర్ 12 వరకు దాదాపు 40 రోజుల పాటు.. క్షణక్షణం ఉత్కంఠ తప్పదన్నమాట. నాన్‌స్టాప్ క్రికెటైన్‌మెంట్‌ కోసం మీతో పాటు మేము కూడా వెయిటింగ్ ఇక్కడ.

టీం ఇండియా వన్డే ప్రపంచకప్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే..

అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా – చెన్నై

అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ – ఢిల్లీ

అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్ – అహ్మదాబాద్

అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్ – పూణె

అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్ – ధర్మశాల

అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్ – లక్నో

నవంబర్ 2: భారత్ vs శ్రీలంక – ముంబై

నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా – కోల్‌కతా

నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ – బెంగళూరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..