T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌ 2024 లోగోను ఆవిష్కరించిన ఐసీసీ.. స్పెషాలిటీ ఏంటంటే?

వచ్చే ఏడాది జూన్ 4 న ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ 2024 కోసం ఐసీసీ కొత్త లోగోను ఆవిష్కరించింది. వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌కు, బంగ్లాదేశ్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఇదే లోగో డిజైన్‌ని ఉపయోగించడం విశేషం. T20 ప్రపంచ కప్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ లోగోలో

T20 World Cup 2024:  టీ20 ప్రపంచ కప్‌ 2024 లోగోను ఆవిష్కరించిన ఐసీసీ.. స్పెషాలిటీ ఏంటంటే?
T20 World Cup 2024

Updated on: Dec 08, 2023 | 8:00 AM

వచ్చే ఏడాది జూన్ 4 న ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ 2024 కోసం ఐసీసీ కొత్త లోగోను ఆవిష్కరించింది. వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌కు, బంగ్లాదేశ్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఇదే లోగో డిజైన్‌ని ఉపయోగించడం విశేషం. T20 ప్రపంచ కప్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ లోగోలో బ్యాట్, బంతి, ఆటగాళ్ల ఎనర్జీని సూచించేలా లోగోను డిజైన్‌ చేశారు. ఈ లోగో డిజైన్‌ను ఆవిష్కరించిన వీడియో ఐసీసీ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా క్రికెట్ ప్రేమికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈసారి పురుషుల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. టీ20 ప్రపంచకప్ జూన్ 4, 2024 నుంచి జూన్ 30 వరకు జరగనుంది. 20 జట్లు తలపడే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఎనిమిది సూపర్-8 మ్యాచ్‌లు ఆడతాయి. సూపర్-8లో పోటీపడుతున్న 8 జట్లలో టాప్-4 జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

టీమిండియా ఈసారైనా

టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన తర్వాత ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఇక తొలి ఎడిషన్ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా టైటిల్ గెలవలేకపోయింది. మరి 9వ ఎడిషన్‌లో భారత జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

T20 ప్రపంచకప్‌లో పోటీపడే జట్లు:

  1. భారతదేశం
  2. ఆఫ్ఘనిస్తాన్
  3. ఆస్ట్రేలియా
  4. బంగ్లాదేశ్
  5. కెనడా
  6. ఇంగ్లండ్
  7. ఐర్లాండ్
  8. నమీబియా
  9. నేపాల్
  10. నెదర్లాండ్స్
  11. న్యూజిలాండ్
  12. ఒమన్
  13. పాకిస్తాన్
  14. పాపువా న్యూ గినియా
  15. స్కాట్లాండ్
  16. దక్షిణ ఆఫ్రికా
  17. శ్రీలంక
  18. ఉగాండా
  19. USA
  20. వెస్టీండీస్‌

 

ఐసీసీ షేర్ చేసిన వీడియో

గత వరల్డ్ కప్ లోగోలు ఇవిగో..

ఐసీసీ ర్యాంకింగ్స్ లో రవి బిష్ణోయ్ టాప్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.