మే నెల భారత క్రికెట్లర్లకు కలిసి రాలేదు. ఐసీసీ ప్రకటించే అర్డులను దక్కించుకోలేక పోయింది. మే నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు’ నామినేషన్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. మెన్స్ విభాగం నుంచి పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీతో పాటు ప్రవీణ్ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్ రహీమ్ పేర్లను నామినేట్ చేసింది.
జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో 14 వికెట్లు తీసుకున్నాడు పాక్ బౌలర్ హసన్ అలీ . ఇక శ్రీలంక బౌలర్ జయవిక్రమ.. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో 11 వికెట్లు కైవసం చేసుకున్నాడు. బంగ్లా క్రికెటర్ రహీమ్ శ్రీలంకతో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించాడు. వన్డే సిరీస్ గెలవడానికి తన వంతు పాత్ర పోషించాడు.
ఇక మహిళా క్రికెట్ విభాగంలో కాథరిన్ బ్రైస్(స్కాట్లాండ్), గేబీ లూయిస్(ఐర్లాండ్), లీ పాల్(ఐర్లాండ్).. గత నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నామినేట్ అయ్యారు.ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో స్కాట్లాండ్ ఆల్రౌండర్ బ్రైస్ టాప్-10లో నిలిచింది.
Also read: These Foods : పరగడుపున ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు..! చాలా డేంజర్.. ఎందుకో తెలుసుకోండి..?
Four Ingredients : ఊపిరితిత్తుల చక్కటి పనితీరు కోసం ఈ నాలుగు దినుసులు తప్పనిసరి..! అవి ఏంటంటే..?
Drumstick Benfits : శాకాహారుల మాంసాహారి మునక్కాయ..! గర్భిణీలకు ఒక వరంలాంటిది.. ఎందుకో తెలుసా..?