
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకారం వినిపిస్తోన్న సమాచారం మేరకు.. టోర్నమెంట్‌ను కరేబియన్ దీవులు, యునైటెడ్ స్టేట్స్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు మార్చడం లేదంట. దీంతో ఇప్పటి వరకు వినిపించిన మార్పులకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.
అమెరికా క్రికెట్ (USAC)లో పరిపాలనా అనిశ్చితి కారణంగా, టోర్నమెంట్‌ను ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్‌లాండ్‌లకు అప్పగిస్తామని గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతా సర్దుకుందంటూ మార్పు లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఈసీబీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, “ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ నుంచి మార్చినట్లు వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఇది ICC నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే” అంటూ చెప్పుకొచ్చాడు.
2024 టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించి ప్రణాళిక ప్రారంభించినట్లు ఐసీసీ తెలిపింది. ICC ప్రతినిధి మాట్లాడుతూ, “రెండు హోస్ట్ రీజియన్‌లలో ఇటీవలే వేదికల తనిఖీలు పూర్తయ్యాయి. జూన్ 2024లో జరిగే ఈవెంట్‌కు సంబంధించిన ప్రణాళిక పూర్తి స్వింగ్‌లో ఉంటుంది” అంటూ పేర్కొంది.
2022లో జరిగిన T20 ప్రపంచ కప్‌నకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలిచింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ రెండోసారి టీ20 చాంపియన్‌గా నిలిచింది. 2010లో తొలిసారిగా ఇంగ్లిష్ జట్టు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేండి..