Women’s World Cup 2022: మహిళల ఫైనల్‌కు రిఫరీగా తెలుగు మహిళ.. మ్యాచ్‌లో ఆ బాధ్యతలు కూడా ఆడాళ్లకే..

Women World Cup: జెంటిల్మెన్‌ గేమ్‌గా పిలిచే క్రికెట్‌ను కేవలం పురుషుల క్రీడగా భావించే వారు ఇప్పటికీ చాలామంది ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ పరిస్థితుల్లో మార్పువస్తోంది. ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌పీల్డ్‌ ఏదైనా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు రాణిస్తున్నారు.

Women’s World Cup 2022: మహిళల ఫైనల్‌కు రిఫరీగా తెలుగు మహిళ..   మ్యాచ్‌లో ఆ  బాధ్యతలు కూడా ఆడాళ్లకే..
Gs Lakshmi
Follow us
Basha Shek

|

Updated on: Apr 02, 2022 | 1:07 PM

Women World Cup: జెంటిల్మెన్‌ గేమ్‌గా పిలిచే క్రికెట్‌ను కేవలం పురుషుల క్రీడగా భావించే వారు ఇప్పటికీ చాలామంది ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ పరిస్థితుల్లో మార్పువస్తోంది. ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌పీల్డ్‌ ఏదైనా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు రాణిస్తున్నారు. క్రికెటర్లుగా మైదానంలో సత్తా చాటుతూనే కోచ్‌లుగా, పర్యవేక్షకులుగా వివిధ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గండికోట సర్వ లక్ష్మి (GS Lakshmi). ఇప్పటికే ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీ ప్యానెల్ లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. గతంలో పురుషుల ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు కూడా రిఫరీగా సేవలందించారు. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు లక్ష్మి. ఈక్రమంలో రేపు (ఏప్రిల్‌3) క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు మ్యాచ్ ఆమె రిఫరీగా వ్యవహరించనున్నారు. కాగా ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఫైనల్ కు రిఫరీగా మహిళ వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అందరూ ఆడాళ్లే..

కాగా ఈ ఫైనల్‌ మ్యాచ్ కు ఫీల్డ్ అంపైర్స్, థర్డ్ అంపైర్ కూడా మహిళలే వ్యవహరించనున్నారు. ఫీల్డ్‌ అంపైర్లుగా లారెన్‌ (దక్షిణాఫ్రికా), కిమ్‌ కాటన్‌ (న్యూజిలాండ్‌), థర్డ్‌ అంపైర్‌గా జాక్వెలిన్‌ (వెస్టిండీస్‌) బాధ్యతలు నిర్వహించనున్నారు. దీంతో క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా ఓ మ్యాచ్‌ మహిళా అంపైర్లు, మహిళా రిఫరీలతో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాధాన్యం ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. కాగా దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించిన మహిళల వన్డే ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. రేపు జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ఈ ఫైనల్ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Also Read:Ravi Teja: మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన టైగర్‌ నాగేశ్వరరావు.. త్వరలోనే షూటింగ్..

Exam dates: ఎగ్జామ్ డేట్సే ఓ పరీక్ష.. సెట్ అవ్వని తేదీలు.. అయోమయంలో విద్యార్థులు

AP: అమ‌రావ‌తిపై హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన ఏపీ సర్కార్.. అందులోని అంశాలు ఇవే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!