Viral Photo: కోహ్లీపై నీ అభిమానం కొంపముంచేలా ఉందే.. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?
Virat Kohli: రసవత్తరంగా సాగుతోన్న నాగ్‌పూర్ టెస్టులో రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన కనిపించింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ఫ్యాన్ ప్రదర్శించిన ఫ్లకార్డ్ అందర్నీ ఆకర్షించింది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లోని జమ్తా స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా 177 పరుగులకు సమాధానంగా టీమిండియా 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆధిక్యం 144 పరుగులకు చేరింది. క్రీజులో రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో నిలిచారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించడంతో 81 పరుగుల భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు.
రసవత్తరంగా సాగుతోన్న నాగ్‌పూర్ టెస్టులో రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన కనిపించింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ఫ్యాన్ ప్రదర్శించిన ఫ్లకార్డ్ అందర్నీ ఆకర్షించింది. దీంతో ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ సారథి కోహ్లిపై ప్రత్యేక అభిమానం చాటుకున్నాడు. ఎంతలా అంటే తాళి కట్టిన భార్యపై కంటే కోహ్లినే అమితంగా ఇష్టపడుతున్నట్లు ప్లకార్డ్ ప్రదర్శించాడు. దీంతో నెటిజన్లు కూడా ఈ అభిమానిపై ఆసక్తికర కామెంట్లను పంచుకున్నారు.




‘కోహ్లీపై అభిమానం చాటుకున్న సంగతి ఓకే కానీ, ఇంటికి వెళ్లాక బడితపూజ ఉంటుంది భయ్యా’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, క్రికెటర్‌పై ప్రేమతో తాళి కట్టిన భార్యను అవమానిస్తావా బ్రో” అంటూ మరో యూజర్ కామెంట్ పంచుకున్నాడు. ఇంతకు ముందు కూడా ఇలానే విరాట్‌పై ప్రత్యేక అభిమానం చాటుకున్న అభిమానులు కూడా ఉన్నారు. కోహ్లి శతకం చేసేవరకు వివాహం చేసుకోనని ఫ్లకార్డ్ చూపించిన ఫ్యాన్ ఫొటో కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయింది. నిజంగానే విరాట్ సెంచరీ చేశాకే పెండ్లి చేసుకున్నానని మ్యారేజ్ ఫొటోను మరోసారి ట్వీట్ చేశాడు.
And yes, that’s his wife next to him. #INDvAUS #BGT2023 pic.twitter.com/FHv8GlA1uS
— Adam Collins (@collinsadam) February 10, 2023
కాగా, ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన కేఎస్ భరత్ 8 పరుగులు చేసి అవుటయ్యాడు. భరత్ మరొక అరంగేట్ర ఆటగాడు టాడ్ మర్ఫీచే ఎల్బీగా ఔట్ అయ్యాడు. మర్ఫీకి ఇది 5వ వికెట్. కేఎల్ రాహుల్ (20 పరుగులు), రవిచంద్రన్ అశ్విన్ (23 పరుగులు), ఛెతేశ్వర్ పుజారా (7 పరుగులు), విరాట్ కోహ్లీ (12 పరుగులు) వికెట్లు తీశాడు. మర్ఫీతో పాటు పాట్ కమిన్స్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ తీశారు. కెప్టెన్ రోహిత్ శర్మ గరిష్టంగా 120 పరుగులు అందించాడు. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అజేయంగా వెనుదిరిగారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
