AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : మ్యారేజీ కౌన్సిలర్‎గా కొత్త అవతారమెత్తిన ఎంఎస్ ధోనీ.. పెళ్లి చేసుకోవాలనుకుంటే టిప్స్ ఇస్తాడట

ఎంఎస్ ధోని మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో, వ్యక్తిగత జీవితంలోనూ అంతే సరదాగా ఉంటాడని ఈ వీడియో నిరూపించింది. ఎంఎస్ ధోని ఒక పెళ్లి వేడుకలో వరుడికి ఇచ్చిన సరదా సలహాలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లయ్యాక భర్తలందరికీ ఒకే రకమైన పరిస్థితి ఎదురవుతుందని ధోని చమత్కరించాడు.

MS Dhoni : మ్యారేజీ కౌన్సిలర్‎గా కొత్త అవతారమెత్తిన ఎంఎస్ ధోనీ.. పెళ్లి చేసుకోవాలనుకుంటే టిప్స్ ఇస్తాడట
Dhoni
Rakesh
|

Updated on: Jul 26, 2025 | 9:26 AM

Share

MS Dhoni : ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి చాలా ఏళ్లయింది. ఇప్పుడు కేవలం ఐపీఎల్‌లో రెండు, రెండున్నర నెలలు మాత్రమే క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటాడు. అయినా సరే, అతను అభిమానుల మధ్య ఎప్పుడూ చర్చలో ఉంటాడు. ప్రస్తుతం క్రికెట్ నుంచి దూరం అయినా తన బిజినెస్ లతో చాలా బిజిగా ఉన్నారు. క్రికెటర్, అంబాసిడర్, బిజినెస్ మ్యాన్ గా మారిన ధోని తాజాగా కొత్త అవతారం ఎత్తాడు. ఈసారి అయితే ఏకంగా మ్యారేజ్ కౌన్సెలర్ గా మారిపోయాడు. ఒక పెళ్లి వేడుకలో వరుడికి ధోని ఇచ్చిన సలహా అక్కడ ఉన్న వారందరినీ పగలబడి నవ్వించింది. పెళ్లయ్యాక అందరు భర్తలకు ఒకే రకమైన పరిస్థితి ఎదురవుతుందని అతను సరదాగా అన్నాడు.

ఎంఎస్ ధోని ఒక పెళ్లి వేడుకలో స్టేజ్ మీద కొత్త జంటతో సరదాగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను వరుడితో సరదాగా, “కొంతమందికి నిప్పుతో ఆడుకోవడం ఇష్టం. ఇతను అలాంటి వాళ్లలో ఒకడు. మీరు వరల్డ్ కప్ గెలిచారా లేదా అనేది ముఖ్యం కాదు, పెళ్లయ్యాక అందరు భర్తలకు ఒకే రకమైన పరిస్థితి ఉంటుంది” అని అన్నాడు.

ధోని వరుడు ఉత్కర్ష్‌తో మాట్లాడుతూ.. “నీకు ఏదైనా అర్థం కాకపోయి ఉంటే, నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను” అని చెప్పాడు. వైరల్ వీడియోలో ఒక ఆడియో క్లిప్ కూడా ఉంది, దాని ద్వారా ధోని వరుడికి “నీ భార్య అందరి కంటే వేరే అని అనుకోవద్దు” అని చెప్పే ప్రయత్నం చేశాడు. దానికి వెంటనే ఉత్కర్ష్ , “నా భార్యేం వేరే కాదు” అని అనగానే, అక్కడ ఉన్న వారందరూ గట్టిగా నవ్వారు. ఈ వీడియో ధోనిలోని సరదా కోణాన్ని మరోసారి బయటపెట్టింది.

ఎంఎస్ ధోని 2010లో సాక్షి సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు జీవా ధోని అనే ఒక కుమార్తె కూడా ఉంది. ఇదే నెల జూలై 4న ధోని, సాక్షి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ధోని చివరిసారిగా ఐపీఎల్ 2025లో ఆడుతూ కనిపించాడు. అక్కడ గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో CSK మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..