Womens IPL 2023: ఉమెన్స్‌ ఐపీఎల్‌తో మహిళల క్రికెట్‌కు మహర్దశ: టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మహిళల ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన బీసీసీఐ.. ఐదు ఫ్రాంచైజీల కొనుగోలుకు రూ.400 కోట్ల ప్రాథమిక ధరగా నిర్ణయించింది.

Womens IPL 2023: ఉమెన్స్‌ ఐపీఎల్‌తో మహిళల క్రికెట్‌కు మహర్దశ: టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌
Womens Ipl 2023
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2022 | 10:35 AM

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహిళల ఐపీఎల్‌ను భారీ స్థాయిలో నిర్వహించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిర్ణయించింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మహిళల ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన బీసీసీఐ.. ఐదు ఫ్రాంచైజీల కొనుగోలుకు రూ.400 కోట్ల ప్రాథమిక ధరగా నిర్ణయించింది. ఈ టోర్నీ కోసం మహిళా క్రికెటర్లు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ ఐపీఎల్ టోర్నీ దేశవాళీ ఆటగాళ్లకు అద్భుతమైన వేదిక అని ప్రస్తుత భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపారు. ‘ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఐపీఎల్ చక్కటి వేదిక అవుతుంది. ఎందుకంటే ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లతో ఆడేందుకు యువ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. అప్పుడు అంతర్జాతీయ క్రికెట్ అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మహిళల ఐపీఎల్‌ భారతదేశంలో దేశీయ, అంతర్జాతీయ మహిళల క్రికెట్‌కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది.అంతర్జాతీయ మ్యాచుల్లో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతుంది’ అని హర్మన్ చెప్పుకొచ్చింది.

400 కోట్ల బేస్ ప్రైస్

తొలి సీజన్‌లో మొత్తం ఐదు ఫ్రాంచైజీల కొనుగోలుకు బీసీసీఐ రూ.400 కోట్ల ప్రాథమిక ధరను నిర్ణయించింది. టెండర్ డాక్యుమెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన కచ్చితమైన సమాచారం వెలువడనుంది. పురుషుల ఐపీఎల్‌ విజయవంతమైన నేపథ్యంలో మహిళల ఐపీఎల్‌లోనూ బీసీసీఐ భారీ మొత్తంపై కన్నేసింది. 400 కోట్లకు 5 ఫ్రాంచైజీలకు బీసీసీఐ టెండర్లను ఆహ్వానించనుంది. మహిళా క్రికెట్ చరిత్రలో ఇదో రికార్డు. దీనికి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

పురుషుల ఐపీఎల్‌ లాగే..

కాగా మహిళల ఐపీఎల్ తొలి సీజన్‌లో మొత్తం 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు ఇతర జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడాలి. పురుషుల IPLలో వలె, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడవ స్థానంలో ఉన్న జట్లు రెండవ ఫైనలిస్ట్‌ను నిర్ణయించడానికి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు ఆడతాయి. ప్రతి ఫ్రాంచైజీ తన తుది జట్టులో ఐదుగురు కంటే ఎక్కువ విదేశీ ఆటగాళ్లను కలిగి ఉండకూడదు. ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..