Mahendra Singh Dhoni 41st Birthday: టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) గురువారం తన 41వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఈమేరకు లండన్ చేరుకున్న మిస్టర్ కూల్.. గురువారం లండన్‌లో తమ పుట్టినరోజును నిర్వహించుకునేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి జులై 4న తన మ్యారేజ్ డేను కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలో జులై 7 నుంచి ఇంగ్లండ్‌తో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అదే రోజు ధోని బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ధోనీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు అభిమానులు కూడా ప్రత్యేక సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో భారత మాజీ కెప్టెన్ 41 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఇందులో ధోని హెలికాప్టర్ షాట్ ఫొటోను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఓ అభిమాని ఈ కటౌట్ ఫోటోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు. దీంతో వేల మంది ధోని ఫొటోకు సలాం చేస్తూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఏడు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ధోనీ కటౌట్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో కేరళలో 35 అడుగుల కటౌట్‌లు, చెన్నైలో 30 అడుగుల కటౌట్‌లను ఏర్పాటు చేశారు.
రెండు రోజుల క్రితం వివాహ వార్షికోత్సం..
మహేంద్ర సింగ్ ధోనీ తన 12వ వివాహ వార్షికోత్సవాన్ని రెండు రోజుల క్రితం లండన్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. 4 జులై 2010న ధోని, సాక్షి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
2022 మే 20న చివరి మ్యాచ్..
40 ఏళ్ల ధోనీ.. చివరి మ్యాచ్ 2022 మే 20న ఆడాడు. అయితే, పసుపు జెర్సీలో ఐపీఎల్‌లో కనిపించాడు. అయితే ఆ మ్యాచ్‌లో చెన్నై టీం 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2022 IPL సీజన్‌లో జట్టు పెద్దగా ఏమీ చేయలేకపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో చెన్నై సీజన్‌ను ముగించింది. అంతకుముందు 2021లో, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో, జట్టు నాల్గవ IPL ట్రోఫీని గెలుచుకుంది. వచ్చే ఏడాది తన జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. 2023 సీజన్‌లో సీఎస్‌కే తరపున ఆడతానని ధోనీ ఓ ప్రకటనలో తెలిపాడు.
MS Dhoni’s 41st birthday will be celebrated with a 41 feet cutout in Vijayawada district. pic.twitter.com/9gWuq4bNHs
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2022
మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచిన ఏకైక కెప్టెన్..
మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అతను తన కెప్టెన్సీలో భారతదేశం కోసం మూడు ICC టోర్నమెంట్లను గెలుచుకున్నాడు. వీటిలో 2007 T20 ప్రపంచకప్, 2011 ODI ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. అతని కెప్టెన్సీలోనే భారత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ధోని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. అతను చివరిసారిగా 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో బ్లూ జెర్సీలో కనిపించాడు.