Cricket: 11 బంతుల్లో 52 పరుగులు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్ల ఊచకోత.. ఎవరీ చెన్నై ప్లేయర్!
ఈ బౌలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంటర్నేషనల్ టీ20ల్లో పదునైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టాడు. అలాగే ఫ్రాంచైజీ టీ20ల్లోనూ..
ఈ బౌలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంటర్నేషనల్ టీ20ల్లో పదునైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టాడు. అలాగే ఫ్రాంచైజీ టీ20ల్లోనూ అద్భుతంగా రాణించాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం తుస్సుమన్నాడు. కానీ ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో మాత్రం అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహించిన ఈ బౌలర్.. మరెవరో కాదు.. క్రిస్ జోర్డాన్.
ఇటీవల సోమర్‌సెట్, సర్రే మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ జోర్డాన్.. అటు బ్యాట్.. ఇటు బంతితో అద్భుతంగా రాణించాడు. సర్రే జట్టుకు సారధిగా వ్యవహరిస్తోన్న జోర్డాన్(73) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్ధి బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్‌లో సర్రే టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా సోమర్‌సెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లకు 218 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ అబెల్(70), ఓపెనర్ విల్ స్మీద్(98) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది.
అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రే జట్టుకు.. ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఎవాన్స్(39), కెప్టెన్ జోర్ధాన్(73) వీరోచితంగా పోరాడటంతో టార్గెట్ దిశగా వేగంగా అడుగులు వేసింది సర్రే జట్టు.. అయితే మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా సరిగ్గా ఆడకపోవడంతో.. ఆ జట్టు 18.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో సర్రే జట్టు ఓటమిపాలైనప్పటికీ.. జోర్డాన్ ఇన్నింగ్స్ అద్భుతం అని చెప్పాలి. 35 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 73 పరుగులు చేశాడు జోర్డాన్. అంటే.. 11 బంతుల్లో 52 పరుగులు బౌండరీల రూపంలో రాబట్టాడు.