RCB vs GT Match Report: సాయి, బట్లర్ ఊరమాస్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..

Royal Challengers Bengaluru vs Gujarat Titans, 14th Match: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి ఓటమిని చవిచూసింది. గుజరాత్ టైటాన్స్ (GT)‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 169 పరుగులు మాత్రమే చేసింది.

RCB vs GT Match Report: సాయి, బట్లర్ ఊరమాస్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
Royal Challengers Bengaluru Vs Gujarat Titans Result

Updated on: Apr 02, 2025 | 11:02 PM

Royal Challengers Bengaluru vs Gujarat Titans, 14th Match: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి ఓటమిని చవిచూసింది. గుజరాత్ టైటాన్స్ (GT)‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 169 పరుగులు మాత్రమే చేసింది. 170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కేవలం 17.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది.

గుజరాత్ టైటాన్ తరపున జోస్ బట్లర్ (60) హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. అలాగే ఓపెనర్ సాయి సుదర్శను (49) కూడా తన క్లాస్ ఆటతో ఆకట్టుకున్నాడు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ భారీ సిక్సర్లతో ఛేజింగ్‌ను ఈజీగా మార్చేశాడు. శుభ్మన్ గిల్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆర్‌సీబీ బౌలర్లలో భువీ, జోస్ తలో వికెట్ పడగొట్టారు.

ఆర్‌సీబీ తరపున లియామ్ లివింగ్‌స్టోన్ (54 పరుగులు) అర్ధ సెంచరీ సాధించాడు. జితేష్ శర్మ 33, టిమ్ డేవిడ్ 32 పరుగులు చేశారు. మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్ 2 వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్ల ప్లేయింగ్-11..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.