GT vs RR: ఈ రోజు (మే 29, ఆదివారం) IPL 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 8 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. నిజానికి 14 ఏళ్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ఫైనల్‌కి వచ్చింది. అయితే ఇక్కడ గుజరాత్ టైటాన్స్ కప్ గెలిస్తే హ్యట్రిక్ విజయం సాధించినట్లవుతుంది. ఈ సీజన్‌లో గుజరాత్, రాజస్థాన్ మధ్య 2 మ్యాచ్‌లు జరగ్గా రెండింటిలో గుజరాత్ విజయకేతనం ఎగరేసింది. ఇప్పుడు ఈ ఫైనల్‌లో గెలిస్తే హ్యాట్రిక్ విజయం సాధించినట్లవుతుంది. ఐపీఎల్ 2022 ద్వారా గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసింది. మొదటి నుంచి ఫైనల్ వరకు వరుస విజయాలు గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు బలమైన జట్టుగా ఎదిగింది. ఈ పరిస్థితిలో రాజస్థాన్.. గుజరాత్ వరుస విజయాలకి అడ్డుకట్ట వేస్తుందా.. కప్ గెలుస్తుందా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.
IPL 2022 మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఏప్రిల్ 14 న ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 37 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. 52 బంతుల్లో అజేయంగా 87 పరుగులు చేసి ఆ తర్వాత బంతితో 18 పరుగులకు 1 వికెట్ తీసుకున్న హార్దిక్ పాండ్యా గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్వాలిఫయర్ వన్‌లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో మే 24న ఇరు జట్ల మధ్య రెండో పోరు జరిగింది.
ఇక్కడ గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను ఓడించి 2-0తో రికార్డును సృష్టించింది. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. డేవిడ్ మిల్లర్ 3 సిక్సర్లు కొట్టడం ద్వారా లక్ష్యాన్ని సాధించింది. గుజరాత్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లలో జోస్ బట్లర్ బాగానే ఆడాడు. అయినా కూడా రాజస్థాన్ ఓడిపోయింది. ఎందుకంటే మిగిలిన ఆటగాళ్లు నిరాశపరిచారు. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య సీజన్‌లో మూడో, ఆఖరి, పోరు జరగనుంది. షేన్ వార్న్‌కి టైటిల్ గెలవాలంటే గుజరాత్ హ్యాట్రిక్ గెలుపుని ఆపాలి. అప్పుడు ఆయనకి ఘన నివాళి అవుతోంది.
Knock-knock, Padosi! ✊
Let’s play ?? #SeasonOfFirsts #AavaDe #GTvRR #TATAIPL #IPLFinal pic.twitter.com/UNTuGWRw6s
— Gujarat Titans (@gujarat_titans) May 28, 2022
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి