IPL 2025: నేటి GT vs LSG పోరులో రికార్డుల వాన! ఎవరెవరు ఏం బద్దలు కొట్టనున్నారో తెలుసా?

ఐపీఎల్ 2025లో GT vs LSG మ్యాచ్ రికార్డులతో నిండి ఉండేలా ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ మరో విజయం ద్వారా టాప్ 2లో నిలవాలని చూస్తుండగా, లక్నో జట్టు గౌరవాన్ని కాపాడే పోరులో ఉంది. శుభ్‌మాన్ గిల్, బట్లర్, రషీద్ ఖాన్, బడోనీ, మార్ష్ లాంటి ఆటగాళ్లు తమ తమ మైలురాళ్లను చేరుకునే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

IPL 2025: నేటి GT vs LSG పోరులో రికార్డుల వాన! ఎవరెవరు ఏం బద్దలు కొట్టనున్నారో తెలుసా?
Shubman Gill Gt

Updated on: May 22, 2025 | 4:20 PM

ఐపీఎల్ 2025 సీజన్ చివర దశలోకి ప్రవేశిస్తున్న వేళ, అభిమానులకు మరిన్ని ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఎదురవుతున్నాయి. అలాంటి మరొక అద్భుత ఘర్షణగా గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగే మ్యాచ్ నిలవనుంది. ఇది టోర్నమెంట్‌లో 64వ మ్యాచ్‌గా జరగనుండగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు అత్యుత్తమ ఫామ్‌తో అదరగొడుతూ 12 మ్యాచ్‌లలో 9 విజయాలను సొంతం చేసుకుని ఇప్పటికే ప్లేఆఫ్ బరిలోకి దూసుకొచ్చారు. ఇక ఒక మ్యాచ్ గెలిస్తే, టాప్ 2లో స్థిరపడే అవకాశం కలుగుతుంది. మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఈ సీజన్‌ను నిరాశగా ముగించారు. 12 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలు మాత్రమే సాధించిన వారు ప్లేఆఫ్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించారు. అయినప్పటికీ, వారు తమ చివరి మ్యాచ్‌ను గెలిచి కొంత గౌరవాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు.

ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటిగా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, అతను తన టీ20 కెరీర్‌లో 500 ఫోర్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 8 ఫోర్లు మాత్రమే కావాలి. ఇదే సమయంలో, అతను భారతదేశంలో టీ20లలో 4000 పరుగుల మార్క్‌కు చేరేందుకు కేవలం 67 పరుగులు దూరంలో ఉన్నాడు. ఈ రెండు ఘనతలూ అతనిని టీ20ల్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లలో నిలిపేలా చేస్తాయి.

ఇక జోస్ బట్లర్ విషయానికొస్తే, గుజరాత్ టైటాన్స్ తరఫున 50 ఫోర్లు పూర్తిచేసేందుకు కేవలం ఒక ఫోర్ మాత్రమే అవసరం. ఈ సీజన్‌లో బట్లర్ ఆటతీరు టైటాన్స్‌కు అనేక విజయాలను అందించింది. మరోవైపు, రషీద్ ఖాన్ తన స్పిన్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిస్తున్నాడు. అతను ఐపీఎల్‌లో 50 క్యాచ్‌ల మైలురాయిని చేరేందుకు కేవలం 3 క్యాచ్‌ల దూరంలో ఉన్నాడు.

లక్నో జట్టులో యువ ఆటగాడు ఆయుష్ బడోనీ కూడా తన కెరీర్‌లో ఓ కీలక ఘట్టానికి దగ్గరవుతున్నాడు. అతను ఇప్పటివరకు చూపించిన ప్రతిభతో LSG కు ఒక నమ్మకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతను తన ఐపీఎల్ కెరీర్‌లో 1000 పరుగుల క్లబ్‌లోకి చేరేందుకు 37 పరుగులు మాత్రమే అవసరమవుతోంది.

ఇక ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ తన 200వ టీ20 మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఒక శక్తివంతమైన ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన మార్ష్, ఈ మ్యాచ్ ద్వారా తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరనున్నాడు. అతని శైలి, సత్తా ఈ మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..