GT vs CSK Playing XI IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?

|

Mar 31, 2023 | 7:23 PM

టాస్ గెలిచిన గుజరాత్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం మొదట బ్యాటింగ్ చేయనుంది.

GT vs CSK Playing XI IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?
Gt Vs Csk Toss
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 4 సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం మొదట బ్యాటింగ్ చేయనుంది.

4 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఓపెనింగ్ సెర్మనీ జరిగింది. 3 సంవత్సరాల తర్వాత టోర్నమెంట్ హోమ్, ఎవే ఫార్మాట్‌లో జరుగుతోంది. అంటే జట్లు తమ సొంత మైదానంలో 7 లీగ్ మ్యాచ్‌లు ఆడనుండగా, మిగిలిన లీగ్ మ్యాచ్‌లు ప్రత్యర్థి జట్టు హోమ్‌గ్రౌండ్‌లో ఆడనున్నాయి.

రెండు జట్ల ప్లేయింగ్-11

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎంఎస్ ధోని(w/c), రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్.

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..