T20 World Cup: ధోని రికార్డులు ఇప్పట్లో బద్దలు కావు.. రోహిత్, కోహ్లీలను ఎగతాళి చేస్తూ గంభీర్ కామెంట్స్

|

Nov 11, 2022 | 1:47 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ కంటే ఎవరైనా ఎక్కువ డబుల్ సెంచరీలు కొట్టే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ కంటే ఎవరైనా ఎక్కువ సెంచరీలు సాధించవచ్చు. కానీ ఇప్పట్లో ఎవరూ ధోనీ లాగా ఏ భారత కెప్టెన్ కూడా మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుస్తాడని నేను అనుకోవడం లేదు' అని చెప్పుకొచ్చాడు గంభీర్.

T20 World Cup: ధోని రికార్డులు ఇప్పట్లో బద్దలు కావు.. రోహిత్, కోహ్లీలను ఎగతాళి చేస్తూ గంభీర్ కామెంట్స్
Gautam Gambhir, Ms Dhoni
Follow us on

టీ20 ప్రపంచకప్ 2022లో సెమీఫైనల్‌తోనే భారత క్రికెట్ జట్టు ప్రయాణం ముగిసింది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది . 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లిష్‌ జట్టు.. 16వ ఓవర్ లోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియా వెళ్లిన రోహిత్ సేన రిక్త హస్తాలతో ఇంటిబాట పట్టింది. దీంతో టీమిండియాపై అభిమానులు, మాజీ క్రికెటర్లు గుర్రుగా ఉన్నారు. ఈనేపథ్యంలో భారతజట్టుకు 2007, 2011 ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్‌ గంభీర్‌ కూడా టీమిండియా ఓటమిపై స్పందించాడు. పనిలో పనిగా గతంలో టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనిని గుర్తు చేసుకున్నాడు. భారత్ ఓటమి తర్వాత స్టార్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ‘ ఇప్పట్లో ధోనీలాగా ఏ భారత కెప్టెన్ కూడా మూడు ఐసీసీ ట్రోఫీలను గెలవలేడు. అవును అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ కంటే ఎవరైనా ఎక్కువ డబుల్ సెంచరీలు కొట్టే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ కంటే ఎవరైనా ఎక్కువ సెంచరీలు సాధించవచ్చు. కానీ ఇప్పట్లో ఎవరూ ధోనీ లాగా ఏ భారత కెప్టెన్ అయినా మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుస్తాడని నేను అనుకోవడం లేదు’ అని చెప్పుకొచ్చాడు.

గంభీర్‌ చెప్పినట్లే ఐసీసీ ఈవెంట్లలో ధోనీకి అద్భుతమైన రికార్డులున్నాయి. అతని కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ధోని సారథ్యంలో తొలిసారిగా 2007లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియా ఆ తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలను సైతం కైవసం చేసుకుంది. ధోనీ మినహా ప్రపంచంలోని ఏ కెప్టెన్ కూడా మూడు వేర్వేరు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోలేదు. ఇక ధోని తర్వాత విరాట్ కోహ్లి టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు. కానీ అతని కెప్టెన్సీలో కూడా టీమ్ ఇండియా ICC ట్రోఫీని గెలవలేకపోయింది. 2017లో విరాట్ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం ఉండగా.. ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. దీని తర్వాత, 2019 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీ ఫైనల్‌లో ఓడిపోయింది. 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. ఇక 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా మొదటి రౌండ్లోనే ఇంటి దారి పట్టింది. తాజాగా ఐదు ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీమిండియాకు ఐసీసీ కప్‌ అందించలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..