AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనో తోపు, టీంలో చోటివ్వండిని వస్తే తాట తీస్తా.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు..!

Gautam Gambhir Comments on Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌ను తప్పించి వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం తన కోచింగ్ ప్రయాణంలో అత్యంత కఠినమైన నిర్ణయమని గౌతమ్ గంభీర్ చెప్పాడు. ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి తనకు నిద్ర కూడా రాలేదని వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు కూడా గంభీర్ కీలక సూచనలు చేశాడు.

అతనో తోపు, టీంలో చోటివ్వండిని వస్తే తాట తీస్తా.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు..!
Gautam Gambhir Comments On Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Sep 24, 2026 | 8:36 AM

Share

Gautam Gambhir Comments on Vaibhav Suryavanshi: భారత క్రికెట్ జట్టు (Team India) టీ20 వ్యవహారాలపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని తీసుకోవడం తనకు అత్యంత కఠినమైన నిర్ణయంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి తాను నిద్రపోలేదని పేర్కొన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూను సిరీస్ తొలి మ్యాచ్ తరువాత పక్కన పెట్టడం అంత సులభం కాదని వివరించాడు. అదే సమయంలో వైభవ్ అద్భుత ఫామ్‌లో ఉండటం, అగ్రస్థానంలో పరుగులు సాధించే అవసరం ఉండటంతో ఆ మార్పు చేయాల్సి వచ్చిందని గంభీర్ వెల్లడించాడు. సంజూతో నేరుగా మాట్లాడి కారణాన్ని వివరించానని, అతడు ఆ నిర్ణయాన్ని మంచి మనసుతో స్వీకరించాడని తెలిపాడు.

వైభవ్‌కు గంభీర్ సూచన..

యువ ఆటగాడిగా వైభవ్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రతి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కడం సాధ్యం కాదని గంభీర్ స్పష్టం చేశాడు. సుదీర్ఘకాలంగా జట్టుకు మంచి ఫలితాలు అందించిన ఆటగాళ్లకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పాడు.

ఎక్కువమంది చదివినది: వీళ్లంతా భారత్‌లోనే హీరోలు.. విదేశాల్లో జీరోలు.. టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా చర్చలు, బయట వినిపించే అభిప్రాయాలు తుది జట్టును నిర్ణయించవని గంభీర్ పేర్కొన్నాడు. మ్యాచ్‌ను గెలిపించగల సామర్థ్యం, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల గత ప్రదర్శన, జట్టు సమతుల్యత వంటి అంశాలే ఎంపికలో ముఖ్యమని వివరించాడు.

వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే సంజూ లేదా అభిషేక్ శర్మ (Abhishek Sharma)లో ఒకరిని తప్పించాల్సి వస్తుందని గంభీర్ గుర్తుచేశాడు. కొద్ది మ్యాచ్‌ల వైఫల్యాల కారణంగా ఇప్పటికే మంచి ఫలితాలు ఇచ్చిన కాంబినేషన్‌ను వెంటనే మార్చడం సరైన విధానం కాదని చెప్పాడు.

శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసలు..

టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వ లక్షణాలను కూడా గంభీర్ ప్రశంసించాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)లో కలిసి పనిచేసిన సమయంలో అయ్యర్‌లోని నిస్వార్థ స్వభావం తనను ఆకట్టుకుందని తెలిపాడు.

జట్టు అవసరాన్ని బట్టి తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవడానికి అయ్యర్ సిద్ధంగా ఉండేవాడని గంభీర్ చెప్పాడు. వ్యక్తిగత స్థానాన్ని పక్కన పెట్టి జట్టు ప్రయోజనాన్ని ముందుకు తీసుకెళ్లడం మంచి నాయకుడి ముఖ్య లక్షణంగా అభివర్ణించాడు.

ఒక్క సిరీస్‌తో తీర్పు వద్దు..

టీ20ల్లో భారత జట్టు గత రెండేళ్ల ప్రయాణాన్ని కూడా గంభీర్ ప్రస్తావించాడు. ప్రపంచకప్ విజయాల మధ్య ఒక్క సిరీస్ లేదా కొన్ని మ్యాచ్‌లలో వచ్చిన వైఫల్యాలు ఆటగాళ్ల సామర్థ్యాన్ని నిర్ణయించవని అన్నాడు.

ఎక్కువమంది చదివినది: ఒక్కో మ్యాచ్‌కు రూ. 19 కోట్లకుపైగానే.. ఖాళీ చేతులతో వచ్చి ఎన్ని కోట్లు పట్టుకెళ్లారంటే?

తన దృష్టిలో నిలకడ చాలా ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశాడు. సరైన నిర్ణయం తీసుకోవడం కోసం కొన్నిసార్లు అభిమానులు కోరిన ఎంపికకు భిన్నంగా వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us