Gautam Gambhir: టీమిండియా కోచ్‌గా గంభీర్ ఫెయిల్? 2011 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ ఇచ్చిన షాకింగ్ రిప్లై
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వస్తున్న విమర్శల వేళ మాజీ లెజెండరీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తన సపోర్ట్ తెలిపారు. 2011 ప్రపంచకప్ హీరో మానసిక ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గౌతమ్ గంభీర్‌పై విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. ఈ కష్టసమయంలో ఆయనకు 2011 వన్డే ప్రపంచకప్ విజేత, మాజీ ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది. గంభీర్ మానసిక సమర్థతను, అతని ఆటిట్యూడ్‌ను కిర్‌స్టెన్ ఆకాశానికెత్తేశారు. ఆటగాడిగా గంభీర్ కసిని దగ్గరుండి చూసిన వ్యక్తిగా, అతనిలోని పట్టుదల జట్టును విజయం వైపు ఎలా నడిపిస్తుందో ఆయన స్పష్టంగా వివరించారు. ఏప్రిల్ 2, 2011న ముంబై వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ పోరును అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు త్వరగా పెవిలియన్ చేరి, జట్టు 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ క్లిష్ట సమయంలో గంభీర్ మైదానంలో నిలబడి ఆడిన తీరు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమే కాకుండా, కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి విజయాన్ని ఖాయం చేశారు.
గురుశిష్యుల మధ్య అపూర్వ బంధం
ఆనాటి ఫైనల్ మ్యాచ్‌లో గంభీర్ కొట్టిన 97 పరుగులు కేవలం ఒక స్కోరు మాత్రమే కాదని, అది భారత దేశ 28 ఏళ్ల కల నెరవేరడానికి వేసిన బలమైన పునాది అని కిర్‌స్టెన్ గుర్తుచేశారు. గంభీర్ మానసికంగా ఎంత దృఢంగా ఉంటాడో ఈ ఇన్నింగ్స్ నిరూపిస్తుందని పేర్కొన్నారు. ఆటగాడిగా అతని వ్యక్తిత్వం తనకు ఎంతగానో నచ్చుతుందని వ్యాఖ్యానించారు. గంభీర్ కూడా పలు సందర్భాల్లో కిర్‌స్టెన్ తన ఆటతీరును మెరుగుపరచడంలో, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఎంతగానో తోడ్పడ్డారని కృతజ్ఞతగా చెప్పారు.
విమర్శలకు గంభీర్ తన శైలిలోనే ఆన్సర్ ఇస్తారా ?
కోచ్‌గా గంభీర్ పనితీరుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కిర్‌స్టెన్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక కోచ్‌గా గంభీర్ పనిచేయడం తాను నేరుగా చూడకపోయినా, అతనిలోని పోరాట పటిమ కచ్చితంగా జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందని కిర్‌స్టెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో క్లిష్ట పరిస్థితులను అధిగమించినట్లే ఇప్పుడు కోచ్‌గా ఎదురవుతున్న ఈ సవాళ్లను కూడా గంభీర్ విజయవంతంగా దాటుతారని అభిమానులు భావిస్తున్నారు. సవాల్ ఎదురైన ప్రతిసారీ తన బ్యాట్‌తోనే జవాబిచ్చిన గంభీర్, ఇప్పుడు కోచ్ రూపంలో వస్తున్న విమర్శలను కూడా అలాగే ఎదుర్కొంటారని అభిమానులు ఆశిస్తున్నారు. గురువు గ్యారీ కిర్‌స్టెన్ అందించిన ఈ మానసిక ధైర్యం గంభీర్‌కు రాబోయే సిరీస్‌లలో మరింత ఊపునివ్వడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
