- Telugu News Sports News Cricket news From Varun Chakravarthy to Allah Ghazanfar Including these 5 Players Are Playing For The First Time In Asia Cup 2025
Asia Cup 2025: ఆసియాకప్‌లో తొలిసారి ఆడనున్న ఐదుగురు.. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపుతిప్పేస్తారంతే
5 Players Are Playing For The First Time In Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. రేపు భారత జట్టు ఓమన్ జట్టుతో తలపడనుంది. అయితే, ఈసారి టోర్నమెంట్‌లో ఐదుగురు పవర్ ఫుల్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.
Updated on: Sep 09, 2025 | 4:00 PM

ఆసియా కప్ 2025 ప్రారంభానికి ఇంకా 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 9న హాంకాంగ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. చాలా మంది ఆటగాళ్ళు ఈ ఆసియా కప్‌లో తొలిసారిగా పాల్గొంటున్నారు. వీరు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన ముద్ర వేశారు. ఏ పరిస్థితిలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల పవర్ ఉన్న ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లా గజన్‌ఫర్ - ఆఫ్ఘనిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ ఇప్పటివరకు రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అతను 11 వన్డేల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు 5 వికెట్లు ఉన్నాయి. టీటి20 క్రికెట్ గురించి చెప్పాలంటే, అతను 44 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 7 కంటే తక్కువ.

వరుణ్ చక్రవర్తి - భారతదేశం: వరుణ్ చక్రవర్తి భారత జట్టు తరపున టీ20 ప్రపంచ కప్ ఆడాడు. కానీ అతను తొలిసారి ఆసియా కప్‌లో ఆడనున్నాడు. అతను 18 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. అతను జట్టుకు ప్రధాన స్పిన్నర్. గత సంవత్సరం తిరిగి వచ్చినప్పటి నుంచి ప్రతి బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టాడు.

కమిల్ మిషారా- శ్రీలంక: కమిల్ మిషారా శ్రీలంక ఆసియా కప్ జట్టులో చోటు సంపాదించాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లో అతను 73 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆసియా కప్‌నకు ముందు అతని బ్యాటింగ్ ప్రత్యర్థి జట్లకు టెన్షన్ పెడుతోంది.

సైమ్ అయూబ్ - పాకిస్తాన్: ఓపెనర్ సైమ్ అయూబ్ పాకిస్తాన్ తరపున 41 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 136 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అతను మొదటి బంతి నుంచే దాడి చేయగలడు. దీంతో పాటు, అతని పేరు మీద 8 వికెట్లు కూడా ఉన్నాయి. సైమ్‌ను పాకిస్తాన్ తరపున మ్యాచ్ విన్నర్‌గా పరిగణిస్తారు.

రిషద్ హుస్సేన్ - బంగ్లాదేశ్: రిషద్ హుస్సేన్ బంగ్లాదేశ్ లెగ్-స్పిన్ బౌలర్. అతను తన టీ20 కెరీర్‌లో 42 మ్యాచ్‌ల్లో 48 వికెట్లు పడగొట్టాడు. దీనితో పాటు, లోయర్ ఆర్డర్‌లో పెద్ద షాట్లు ఆడే సామర్థ్యం కూడా అతనికి ఉంది. అందుకే అతను ప్రత్యర్థి జట్లకు పెద్ద ముప్పుగా మారగలడు.




