పేడ పిచ్ మీద ప్రాక్టీస్‌తో స్టార్ బౌలర్ల దూల తీర్చిన బుడ్డోడు.. రోహిత్ నుంచి సచిన్ వరకు.. ఎవరేమన్నారంటే?

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నప్పుడు వైభవ్ కేవలం 35 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఈ లీగ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఈ విషయంలో అతను భారత ఆటగాడు యూసుఫ్ పఠాన్‌ను మించిపోయాడు. ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ జట్టు వైభవ్‌ను రూ. 1.1 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

పేడ పిచ్ మీద ప్రాక్టీస్‌తో స్టార్ బౌలర్ల దూల తీర్చిన బుడ్డోడు.. రోహిత్ నుంచి సచిన్ వరకు.. ఎవరేమన్నారంటే?
Vaibhav Suryavanshi Century

Updated on: Apr 29, 2025 | 12:15 PM

Vaibhav Suryavanshi: ఒక తండ్రి తన బిడ్డ సక్సెస్ కోసం తాను చేయగలిగినదంతా చేస్తుంటాడు. ప్రతీ తండ్రి కోరిక తన బిడ్డ తనను మించిపోవాలని చూస్తుంటాడు. వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీకి కూడా ఇదే ఆలోచన వచ్చింది. వైభవ్ తండ్రి వృత్తిరీత్యా రైతు. కానీ, తన కొడుకును క్రికెటర్‌గా చేయాలని ఆయన కలలు కన్నాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ బ్లాక్ అనే చిన్న గ్రామంలో నివసించే వైభవ్ తండ్రి వ్యవసాయం చేసేవాడు. సమస్తిపూర్ వంటి చిన్న పట్టణంలో క్రికెట్‌కు మంచి శిక్షణ, కోచింగ్ సౌకర్యాలు అందుబాటులో లేవు.

ఇటువంటి పరిస్థితిలో, తండ్రి వైభవ్‌ను శిక్షణ కోసం బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో పంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం డబ్బు కూడా అవసరమైంది. పెద్దగా ఆదాయ వనరులు లేవు. కాబట్టి వైభవ్ తండ్రి తన భూమిని అమ్మేశాడు. అతని తండ్రి వైభవ్ కోసం అన్నీ పణంగా పెట్టాడు. తన కొడుకుకి తానే టిఫిన్ ప్యాక్ చేసేవాడు. వైభవ్‌కు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతను తనకంటే సీనియర్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేవాడు. ఒక రోజులో 600 కంటే ఎక్కువ బంతులు ఆడేవాడు. వైభవ్ తండ్రి పడిన ఈ కృషి వృధా కాలేదు. వైభవ్ లాంటి దేశంలో, ప్రతిరోజూ లక్షలాది మంది యువత క్రికెటర్ కావాలని కలలు కంటారు. కానీ, చాలా కొద్దిమంది మాత్రమే విజయం సాధిస్తారు. ఇలాంటి పరిస్థితిలో, వైభవ్ క్రికెటర్ కాకపోతే, అతని తండ్రి సర్వస్వం కోల్పోయేవాడు.

ఇవి కూడా చదవండి

14 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన వైభవ్..

నిజానికి వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 14 సంవత్సరాలు. 14 ఏళ్ల పిల్లలు తరచుగా చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లడం కనిపిస్తుంది. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వైభవ్ అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఓడించిన తీరు నమ్మశక్యం కాదు. వైభవ్ తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇదే ఉత్సాహంతో మరిన్ని రికార్డులు నెలకొల్పుతూ, భారత జట్టులో చోటు దక్కించుకోవాలని అంతా కోరుతున్నారు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నప్పుడు వైభవ్ కేవలం 35 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఈ లీగ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఈ విషయంలో అతను భారత ఆటగాడు యూసుఫ్ పఠాన్‌ను మించిపోయాడు. ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ జట్టు వైభవ్‌ను రూ. 1.1 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై వైభవ్ దాడి చేసిన తీరును చూసి, సచిన్ టెండూల్కర్ , రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు కూడా ఈ బుడ్డోడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైభవ్ ఇన్నింగ్స్ గురించి సచిన్ ఏమన్నాడంటే..

యూసఫ్ పఠాన్ ట్వీట్..

లక్నో ఓనర్ సంజీవ్..

ఆనంద్ మహీంద్రా..


మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..