World Test Championship Final 2023: ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో బ్యాటింగ్ నుంచి బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలపై స్పెషల్ ఫోకస్ చేసింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భారత జట్టు చాలా కాలంగా ఆడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా పర్ఫెక్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టీమిండియా స్వ్కాడ్‌లో ఈ ప్లేయర్లు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండొచ్చని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఆ ముగ్గురు ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హార్దిక్ పాండ్యా..
స్టార్ ఇండియన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల కాలంలో హార్దిక్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. హార్దిక్ జట్టుకు గొప్ప ఆల్ రౌండ్‌గా మారాడు. జట్టు మిడిల్ ఆర్డర్‌లో బ్యాట్‌తో గణనీయమైన సహకారం అందించడంతో పాటు, అతను బౌలింగ్‌లో జట్టుకు అదనపు పేసర్ ఎంపికను ఇచ్చాడు. 2022లో ఆడిన టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు నాలుగో పేసర్‌గా అవతరించాడు. హార్దిక్ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.
శార్దూల్ ఠాకూర్..
శార్దూల్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున మొత్తం 8 టెస్టులు ఆడాడు. అందులో అతను ఇంగ్లాండ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. జట్టులో బౌలింగ్‌తో పాటు శార్దూల్ బ్యాటింగ్‌కు కూడా పేరుగాంచాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు శార్దూల్ గురించి సెలక్టర్లు ఆలోచించాలని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ‘ఐసీసీ రివ్యూ’లో అన్నారు. దీనిపై దినేష్ కార్తీక్ మాట్లాడుతూ అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ జట్టులోకి రాగలడని చెప్పుకొచ్చాడు.
కేఎల్ రాహుల్..
ప్రస్తుతం ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్, ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టుకు చాలా విజయవంతమవుతాడని నిరూపించగలడు. తన టెస్టు కెరీర్‌లో 7 టెస్టు సెంచరీలలో, అతను ఇంగ్లాండ్‌లో 2 సెంచరీలు సాధించాడు. ఇందులో 2018లో ఓవల్‌లో 149 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ఓపెనర్‌గా కాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
‘ఐసీసీ రివ్యూ’లో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ రికార్డుల గురించి మాట్లాడాడు. భారత జట్టులో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ కలిసి ఆడగలరని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..