
Asia Cup 2025 Ind Vs Pak
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే పెద్ద మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. రెండు దేశాల ఆటగాళ్లు దీని కోసం తీవ్రంగా సిద్ధమవుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో, భారత్, పాకిస్తాన్ చరిత్రలో T20I ఫార్మాట్‌లో ఎవరు ఎక్కువ వికెట్లు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
- 2016 నుంచి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన వారిలో బుమ్రా కాదు, హార్దిక్ పాండ్యా ముందంజలో ఉన్నాడు. పాకిస్థాన్‌పై ఏడు మ్యాచ్‌ల్లో హార్దిక్ 11 వికెట్లు పడగొట్టాడు.
- హార్దిక్ పాండ్యా తర్వాత టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ కూడా పాకిస్థాన్ పై తన సత్తా చాటాడు. పాకిస్థాన్ పై ఏడు మ్యాచ్ ల్లో భువనేశ్వర్ కుమార్ 11 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు.
- ఈ జాబితాలో పాకిస్తాన్‌కు చెందిన భయంకరమైన ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ పేరు మూడవ స్థానంలో ఉంది. భారత్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఉమర్ గుల్ 11 వికెట్లు పడగొట్టి జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.
- ఉమర్ గుల్ తర్వాత పాకిస్తాన్ డాషింగ్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా పేరు కూడా ఉంది. నసీమ్ షా ఇప్పటివరకు భారత్‌తో జరిగిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసి నాల్గవ స్థానంలో ఉన్నాడు. కానీ, అతను ఈ ఆసియా కప్ జట్టుకు దూరంగా ఉన్నాడు.
- గత మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని అర్ష్‌దీప్ సింగ్ కూడా టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్ సింగ్ ఏడు వికెట్లు తీసి ఐదో స్థానంలో ఉన్నాడు.
- టీం ఇండియా ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పాలంటే, అతను ఇప్పటివరకు పాకిస్థాన్‌తో నాలుగు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో, బుమ్రా అత్యుత్తమ స్పెల్ 14 పరుగులకు మూడు వికెట్లు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..