Cricket: పొట్టకూటి కోసం సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్..

Pakistani Umpire: ఒకప్పుడు ఇతనికి చాలా పేరు ఉంది. అతను ICC ఎలైట్ ప్యానెల్‌లో కూడా చేరాడు. ఈ అంపైర్‌కు 107 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేసిన అనుభవం ఉంది.

Cricket: పొట్టకూటి కోసం సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్..
Asad Rauf

Updated on: Jun 24, 2022 | 3:28 PM

Pakistan Cricket Board: పాకిస్తాన్‌కు చెందిన ఐసీసీ ప్యానల్ అంపైర్ అసర్ రవూఫ్.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో చాలాసార్లు అంపైరింగ్ చేసిన ఇతను.. నేడు తన జీవనోపాధి కోసం సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్ముతున్నాడు. అసద్ రవూఫ్ ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ప్రసిద్ధ లాండా బజార్‌లో షూ, బట్టల దుకాణాన్ని నడుపుతున్నాడు. కాగా, 2000 నుంచి 2013 వరకు 107 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన అసద్ రవూఫ్.. అనంతరం నిషేధానికి గురయ్యాడు. అసద్ ఒకప్పుడు ICC ఎలైట్ ప్యానెల్‌లో భాగంగా ఉండేవాడు. అతను ప్రపంచ కప్, ఐపీఎల్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. అంపైర్ల కోసం పాకిస్తాన్ బోర్డ్ సాయం చేయాలని కోరుతున్నాడు.

ఈ పని నా కోసం కాదు..

ఇవి కూడా చదవండి

ఈ పని నాకోసం కాదని, తన సిబ్బంది కోసం అని అంటున్నాడు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇది నా కోసం కాదు. ఇది నా సిబ్బంది రోజువారీ వేతనాల కోసం. నేను వారి కోసం పని చేస్తాను. నా జీవితంలో చాలా మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాను. ఇప్పుడు నన్ను ఎవరూ చూడడం లేదు. నేను 2013 నుంచి ఆటకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఒకసారి ఉద్యోగం వదిలివేస్తే పూర్తిగా వదిలివేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

నిషేధం ఎందుకంటే?

అసద్ అవినీతికి పాల్పడినట్లు తేలినందున 2016లో బీసీసీఐ అతడిపై నిషేధం విధించింది. ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అతని పేరు వచ్చింది. బుకీల నుంచి బహుమతులు తీసుకున్నారని ఆరోపించారు. రవూఫ్‌పై కూడా ఓ మోడల్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ముంబైకి చెందిన ఈ మోడల్ మాట్లాడుతూ, రవూఫ్ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, మోసం చేశాడని చెప్పుకొచ్చింది.