AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా తొలి సమస్య అదే..: మెగా ఈవెంట్‌కు ముందే వార్నింగ్ ఇచ్చిన ధోని

MS Dhoni Comments on Team India: మరో 3 రోజుల్లో అంటే ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక దేశాల్లో సంయుక్తంగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు మాజీ ఛాంపియన్ ప్లేయర్ ధోని కీలక హెచ్చరికలు పంపాడు.

Team India: టీమిండియా తొలి సమస్య అదే..: మెగా ఈవెంట్‌కు ముందే వార్నింగ్ ఇచ్చిన ధోని
Ms Dhoni
Venkata Chari
|

Updated on: Feb 04, 2026 | 12:17 PM

Share

Team India: టీమిండియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని.. ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న ఐసీసీ మెగా టోర్నీకి ముందు గంభీర్ సేనను హెచ్చరించాడు. రాబోయే మ్యాచ్ ల్లో మంచు కీలకపాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ఇందుకోసం టీమిండియా ప్రిపేర్ అవ్వాలని సూచించాడు. భారత జట్టు మ్యాచ్ లు రాత్రివేళ్లల్లోనే జరగనున్నాయి. దీంతో మంచుతో సెకండ్ బౌలింగ్ చేయడం సవాలుతో కూడుకుంటుందని తెలిపాడు.

భారత జట్టు ఇప్పటి వరకు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తొలుత 2007లో గెలిచిన తర్వాత దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ధోని భారత జట్టుకు కీలక సూచనలు చేశాడు.

టీమిండియాకు అడ్డు అదే..

ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన ఫాంలో ఉంది. యువ ఆటగాళ్లతో భారీ టార్గెట్ నైనా ఛేజింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో స్వదేశంలో జరిగే ప్రపంచకప్ కోసం ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. భారత్ లో జరిగే మ్యాచ్ లకు మంచు ప్రధాన అడ్డంకిగా ఉండనుంది. టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ ఓడిన జట్లు సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ మంచుతో భారత ఆటగాళ్లు ఇబ్బంది పడవచ్చు. కీలక సమయంలో వికెట్లు కోల్పోతే ఒత్తిడి ఎక్కువ అవుతుందంటూ ధోని చెప్పుకొచ్చాడు.

మెన్ ఇన్ బ్లూ టీం ప్రస్తుతం టీ20 ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. సూర్య సారథ్యంలో భారత జట్టు మొత్తం 43 మ్యాచ్ లు ఆడి కేవలం 7 మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది.

అత్యుత్తమ ఆటగాళ్లను బెంచ్ లో కూర్చొబెట్టవద్దు. అలా చేస్తే నాకౌట్ దశల్లో భారత జట్టుుకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. టీ20 క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు. కీలక ఆటగాళ్లకు మాత్రం సెలవు ఇవ్వకూడదు. ఎందుకంటే, ప్రత్యర్థి జట్టు బలంగా బరిలోకి దిగితే, మనకు ఇబ్బందులు ఎదువుతాయంటూ మాజీ కెప్టెన్ వివరించాడు.

గాయాలపాలవ్వొద్దు..

క్రికెట్ అంటేనే ఆటగాళ్లు ఎక్కువగా గాయపడుతుంటారు. ముఖ్యంగా ఫీల్డింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఏ ఆటగాడు కూడా గాయపడొద్దంటూ కోరాడు.

‘లీగ్ దశలోనైనా, నాకౌట్ దశలోనైనా అంతా మంచే జరగాలి. ఏ ఆటగాడు కూడా గాయాలపాలవ్వొద్దు. టీం ఏ పాత్ర ఇచ్చినా నెరవేర్చాలి’ అంటూ సూచించాడు. కాగా, ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయల బారిన పడ్డారు. దీంతో భారత జట్టుకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాడు. తిలక్ వర్మ ఇప్పటికే ఫిట్ నెస్ టెస్ట్ పాసవ్వడం కొంత ఊరటనిస్తోంది. తిరిగి జట్టుతోనూ చేరాడు. ఇక భారత జట్టు తన టీ20 ప్రపంచకప్ ప్రయాణాన్ని అమెరికాతో ఫిబ్రవరి 7న మొదలుపెట్టనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us