IPL 2021: ఐపీఎల్ సెకండాఫ్‌కు రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత.. ఫ్రాంచైజీల నిర్ణయం.!!

|

Jun 03, 2021 | 2:48 PM

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 పున: ప్రారంభానికి రంగం సిద్దమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌ విండోలో ఐపీఎల్ సెకండాఫ్..

IPL 2021: ఐపీఎల్ సెకండాఫ్‌కు రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత.. ఫ్రాంచైజీల నిర్ణయం.!!
Follow us on

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 పున: ప్రారంభానికి రంగం సిద్దమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌ విండోలో ఐపీఎల్ సెకండాఫ్ షూరూ కానుంది. ఈ విషయాన్ని ఇటీవలే బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ సెకండాఫ్‌కు అందుబాటులో ఉండరని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాటికి చెక్ పెడుతూ ఫ్రాంచైజీలు ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌ సెకండాఫ్ మ్యాచ్‌లకు రాని విదేశీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో కోత విధించేందుకు సిద్దమైనట్లు బీసీసీఐకి చెందిన ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. కేవలం ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే ఫ్రాంచైజీలు జీతాలు చేల్లిస్తాయని, ఆడని మ్యాచ్‌లకు జీతాలు చెల్లించబోరని వెల్లడించారు. అయితే బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్ల జీతాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్‌ వీడియో..

Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..