
Fastest Fifty in Test Cricket: క్రికెట్‌లో అల్టిమేట్ ఫార్మాట్ అంటే టెస్ట్ అనే చెబుతుంటారు. అయితే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో కలకాలం గుర్తిండిపోయేలా రికార్డులు నెలకొల్పాలని ప్రతీ ప్లేయర్ కోరుకుంటుంటారు. అయితే, ఇవి కొందరికి మాత్రమే సాధ్యమవుతుంటాయి. టీ20 ఫార్మాట్ వచ్చాక టెస్ట్ క్రికెట్ కూడా మారిపోయింది. జిడ్డు బ్యాటింగ్‌లా కాకుండా తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో టీ20 బ్యాటింగ్‌తో ఫాస్టెస్ట్ హాప్ సెంచరీ చేసిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ లిస్టులో టీమిండియా తరపున టాప్ 10లో ఒక్కరు కూడా లేదు. అయితే, టాప్ 20లో మాత్రం ముగ్గురు భారత క్రికెటర్ల పేర్లు ఉన్నాయి. ఇందులో రిషబ్ పంత్ రెండు సార్లు ఈ లిస్టులో చేరాడు. కపిల్ దేవ్ కూడా టాప్ 20లో చేరాడు. ఇక టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల పూర్తి జాబితాను ఇప్పుడు చూద్దాం..
టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ పేరిట ఉంది. అతను 2014లో అబుదాబిలో ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు.
2017లో సిడ్నీలో పాకిస్థాన్‌పై రెండవ వేగవంతమైన టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.
2025లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతంలో 2022లో శ్రీలంకపై 28 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు.
|
బంతులు
|
ప్లేయర్
|
మ్యాచ్
|
స్థానం
|
సంవత్సరం
|
| 21 | మిస్బా-ఉల్-హక్ | పాకిస్తాన్ v ఆస్ట్రేలియా | అబుదాబి | 2014 |
| 23 | డిఏ వార్నర్ | ఆస్ట్రేలియా v పాకిస్తాన్ | సిడ్నీ | 2017 |
| 24 | జెహెచ్ కాలిస్ | దక్షిణాఫ్రికా v జింబాబ్వే | కేప్ టౌన్ | 2005 |
| 24 | బెన్ స్టోక్స్ | ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ | బర్మింగ్‌హామ్ | 2024 |
| 25 | ఎస్ షిల్లింగ్‌ఫోర్డ్ | వెస్టిండీస్ v న్యూజిలాండ్ | కింగ్స్టన్ | 2014 |
| 26 | షాహిద్ అఫ్రిది | పాకిస్తాన్ వర్సెస్ ఇండియా | బెంగళూరు | 2005 |
| 26 | మొహమ్మద్ అష్రఫుల్ | బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా | మీర్పూర్ | 2007 |
| 26 | స్టెయిన్ | దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ | పోర్ట్ ఎలిజబెత్ | 2014 |
| 27 | యూసుఫ్ యుహానా | పాకిస్తాన్ v దక్షిణాఫ్రికా | కేప్ టౌన్ | 2003 |
| 28 | విలియమ్స్ | వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ | బ్రిడ్జ్‌టౌన్ | 1948 |
| 28 | ఐటి బోథం | ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా | ఢిల్లీ | 1981 |
| 28 | సిహెచ్ గేల్ | వెస్ట్ ఇండీస్ v న్యూజిలాండ్ | పోర్ట్ ఆఫ్ స్పెయిన్ | 2014 |
| 28 | సి డి గ్రాండ్‌హోమ్ | న్యూజిలాండ్ v శ్రీలంక | క్రైస్ట్‌చర్చ్ | 2018 |
| 28 | రిషబ్ పంత్ | భారత్ వర్సెస్ శ్రీలంక | బెంగళూరు | 2022 |
| 29 | బి యార్డ్లీ | ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ | బ్రిడ్జ్‌టౌన్ | 1978 |
| 29 | టిజి సౌతీ | న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ | నేపియర్ | 2008 |
| 29 | రిషబ్ పంత్ | ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా | సిడ్నీ | 2025 |
| 30 | కపిల్ దేవ్ | ఇండియా వర్సెస్ పాకిస్తాన్ | కరాచీ | 1982 |
| 30 | రిచర్డ్స్ | వెస్టిండీస్ వర్సెస్ ఇండియా | కింగ్స్టన్ | 1983 |
| 30 | టిఎం దిల్షాన్ | శ్రీలంక v న్యూజిలాండ్ | గాలే | 2009 |
| 30 | బిబి మెకల్లమ్ | న్యూజిలాండ్ v పాకిస్తాన్ | షార్జా | 2014 |
| 30 | జె.ఎం. బెయిర్‌స్టో | ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ | లీడ్స్ | 2022 |
| 31 | ఎ రణతుంగ | శ్రీలంక v భారతదేశం | కాన్పూర్ | 1986 |
| 31 | క్రోన్జే | దక్షిణాఫ్రికా v శ్రీలంక | సెంచూరియన్ | 1998 |
| 31 | ఎస్.ఎన్. ఠాకూర్ | ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ | ది ఓవల్ | 2021 |
| 31 | యశస్వి జైస్వాల్ | ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ | కాన్పూర్ | 2024 |
| 32 | ఐటి బోథం | ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ | ది ఓవల్ | 1986 |
| 32 | వి సెహ్వాగ్ | ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ | చెన్నై | 2008 |
| 32 | ఉమర్ అక్మల్ | పాకిస్తాన్ v న్యూజిలాండ్ | వెల్లింగ్టన్ | 2009 |
| 32 | స్టార్క్ | ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా | పెర్త్ | 2012 |
| 32 | బెన్ డకెట్ | ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ | నాటింగ్‌హామ్ | 2024 |
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..