Fastest Century in Odi Cricket: హరారేలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా సెంచరీ సాధించాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజా కేవలం 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో జింబాబ్వే తరపున వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రాజా రికార్డు సృష్టించాడు. ఇంతకీ వన్డే క్రికెట్‌లో తుఫాన్ సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1- ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా): 2015లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ.
2- కోరీ అండర్సన్ (న్యూజిలాండ్): 2014లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కోరీ అండర్సన్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్‌లో ఇది 2వ వేగవంతమైన సెంచరీ.
3- షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్): 1996లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ షాహిద్ అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
4- బ్రియాన్ లారా (వెస్టిండీస్): 1999లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
5- జోస్ బట్లర్ (ఇంగ్లండ్): 2015లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ కేవలం 46 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
6- సనత్ జయసూర్య (శ్రీలంక): శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య 1996లో పాకిస్థాన్‌పై 48 బంతుల్లో సెంచరీ సాధించాడు.
7- కెవిన్ ఓబ్రెయిన్ (ఐర్లాండ్): 2011లో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రెయిన్ కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
8- గ్లెన్ మాక్స్ వెల్ (ఆస్ట్రేలియా): 2015లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కేవలం 51 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
9- విరాట్ కోహ్లీ (భారత్): 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ కేవలం 51 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో వన్డే క్రికెట్‌లో టీమిండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు.
10- సికిందర్ రాజా (జింబాబ్వే): జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా 2023లో నెదర్లాండ్స్‌పై కేవలం 54 బంతుల్లో సెంచరీ సాధించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..