Watch Video: కెప్టెన్ అయితే నువ్వేమైనా తోపా.. నీకు ఆ ఆర్హత లేదంటూ నెటిజన్ల ఫైర్.. ఎందుకంటే?
Hardik Pandya: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తోటి ఆటగాడైన మహ్మద్ షమీపై అరుస్తూ కనిపించాడు. సీనియర్ పేసర్‌పై గుజరాత్ కెప్టెన్ విరుచుకుపడటంతో నెటిజన్లు ఫైరవుతున్నారు.
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) టీం విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసింది. సోమవారం జరిగిన ఈ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్బుతంగా ఆడి, విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టీం వరుసగా తన రెండో విజయాన్ని నమోదు చేసింది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ టీం మూడు విజయాల తర్వాత ఓటమిపాలైంది. తన కెరీర్‌లో తొలిసారిగా ఐపీఎల్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్న హార్దిక్.. ఇప్పటివరకు బాగానే ఆకట్టుకుంటున్నాడు. అయితే, ఓ విషయంలో మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇప్పటి వరకు దిగ్గజ కెప్టెన్లే ఇలా చేయలేదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ధోనీ, కోహ్లీ, రోహిత్ లాంటి వారు కూడా ఇలా ప్రవర్తించలేదు, నువ్వు ఓ సీనియర్ ఆటగాడిని అరవడం ఏం బాగోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
గుజరాత్ అందించిన టార్గెట్‌ను చేరుకునే క్రమంలో కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ బ్యాట్‌తో ఆకట్టుకోవడంతో ఆట నెమ్మదిగా హైదరాబాద్ ఒడిలోకి చేరిపోయింది. ఓ సందర్భంలో, సీనియర్ పేసర్ మహమ్మద్‌పై హార్దిక్ తన నిగ్రహాన్ని కోల్పోయాడు. అది కూడా చాలా కష్టమైన క్యాచ్ అని తెలిసి కూడా తన నోరు పారేసుకున్నాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో 13వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. గుజరాల్ సారథి హార్దిక్ ఈ ఓవర్‌ను బౌలింగ్ చేస్తున్నాడు. విలియమ్సన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి థర్డ్ మ్యాన్‌లో ఓషాట్ ఆడాడు. అయితే మహ్మద్ షమీ.. క్యాచ్ పట్టేందుకు ప్రయత్నం చేయలేదంటూ హార్దిక్ ఆగ్రహానికి గురయ్యాడు.
అయితే, క్యాచ్ అందుకునేందుకు బాల్ చాలా దూరంగా ఉందని అందరికీ తెలుసు. అప్పటికే భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ప్రస్టేషన్‌ను షమీపై చూపిస్తూ.. అకారణంగా అరిచాడంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈమేరకు ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. సీనియర్ స్థాయి ఉన్న ఆటగాడిపై తిట్ల వర్షం కురిపించడమేంటంటూ గుజరాత్ సారథిపై పలు విమర్శలు చేస్తున్నారు.
అయితే, ఈమ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తోనూ, బంతితోనూ చక్కటి ప్రదర్శన చేశాడు. 42 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేసి, గుజరాత్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకు చేరుకుంది. బంతితో, హార్దిక్ SRH కెప్టెన్ విలియమ్సన్ వికెట్‌ను పడగొట్టాడు. అయితే, అంతకుముందు తన తొలి రెండు ఓవర్లలో హార్దిక్ 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత గుజరాత్ కెప్టెన్ తన పూర్తి కోటా 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన గుజరాత్.. ఈ సీజన్‌లో తొలి ఓటమి చవిచూసింది. అయితే 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన టైటాన్స్.. పాయింట్ల పట్టికలో 5వ ర్యాంక్‌లో నిలిచింది.
Dear Hardik, you are a terrible captain. Stop taking it out on your teammates, particularly someone as senior as Shami. #IPL #IPL2022 #GTvsSRH pic.twitter.com/9yoLpslco7
— Bodhisattva #DalitLivesMatter ???️? (@insenroy) April 11, 2022