CSK vs RCB Playing XI IPL 2022: బెంగళూరుతో అమీతుమీకి సిద్ధమైన చెన్నై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

CSK vs RCB Playing XI IPL 2022: బెంగళూరుతో అమీతుమీకి సిద్ధమైన చెన్నై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
Csk Vs Rcb Playing Xi Ipl 2022

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఈ సీజన్‌లో తొలి విజయంపై కన్నేసింది. అయితే బెంగళూరు జట్టు అద్భుతమైన రిథమ్‌లో ఉండడంతో, చెన్నై జట్టు విజయం సాధించాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి..

Venkata Chari

|

Apr 12, 2022 | 1:14 PM

ఐపీఎల్ 2022 (IPL 2022) లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆశించిన ప్రదర్శన అతని ఇంతవరకు కనిపించలేదు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన జడేజా సారథ్యంలోని ఆ జట్టు.. నాలుగింటిలోనూ ఓటమి చవిచూసింది. తదుపరి మ్యాచ్‌లో ఈ సీజన్‌లోనే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(CSK vs RCB)తో తలపడనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఈ సీజన్‌లో తొలి విజయంపై కన్నేసింది. అయితే బెంగళూరు జట్టు అద్భుతమైన రిథమ్‌లో ఉండడంతో, చెన్నై జట్టు విజయం సాధించాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో చెన్నైకి బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో ఘోరంగా విఫలమవుతుంది. ఈ రెండు విభాగాల్లోనూ జట్టు ఆటగాళ్లు(Playing XI) తమ సత్తా చాటలేకపోవడంతో ఓటమిపాలవుతున్నారు.

ఎప్పుడు: చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఏప్రిల్ 12, 2022, రాత్రి 7:30 గంటలకు

ఎక్కడ: డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, ముంబై

ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్

బెంగళూరు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా అందులో మూడు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. జట్టు బౌలింగ్‌ నుంచి బ్యాటింగ్‌ వరకు అన్నీ రంగాల్లో అద్భుతమైన పాంలో ఉంది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఫామ్‌లో ఉండగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పరుగులు చేస్తున్నాడు. గత మ్యాచ్‌లో అనూజ్ రావత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి సహకరించాడు. వీరితో పాటు షహబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ ఇప్పటివరకు ఫినిషర్ పాత్రకు న్యాయం చేస్తూ కనిపించారు.

RCBలో ఒక మార్పు..

చెన్నైపై బెంగళూరు జట్టులో మార్పు కనిపిస్తోంది. తన సోదరి మరణంతో బెంగళూరు బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన హర్షల్ పటేల్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో అతను ఈ మ్యాచ్‌లో ఆడకపోవచ్చు. ఎందుకంటే పటేల్ తిరిగి వచ్చినా, అతను మూడు రోజుల నిర్బంధాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. హార్షల్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్‌కు అవకాశం ఇవ్వవచ్చు. అదే సమయంలో, డేవిడ్ విల్లీ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ వచ్చే ఛాన్స్ ఉంది.

చెన్నై ప్లేయింగ్ 11 మారుతుందా?

చెన్నై ఆటతీరు ఫర్వాలేదు. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే మాత్రం మార్పులు చేస్తారని తెలుస్తోంది. ముఖేష్ చౌదరి స్థానంలో రాజ్‌వర్ధన్ హెంగెర్‌గేకర్‌కి అవకాశం లభిస్తుంది. ఇది తప్ప జట్టులో మరో మార్పు లేదు.

మీకు తెలుసా:

– విరాట్ కోహ్లీ చెన్నైకి వ్యతిరేకంగా 1000 పరుగులకు చేరుకోవడానికి కేవలం 52 పరుగుల దూరంలో ఉన్నాడు.

– RCBకి వ్యతిరేకంగా రవీంద్ర జడేజా 28 ఇన్నింగ్స్‌ల్లో 23 వికెట్లు తీశాడు

– దీపక్ చాహర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. CSK ఈ సీజన్‌లో నాలుగు గేమ్‌లలో పవర్‌ప్లేలో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకోగలిగింది.

చెన్నైదే ఆధిపత్యం..

వీరిద్దరి మధ్య జరిగిన మొత్తం మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే.. చెన్నై జట్టుదే పైచేయి సాధించింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై జట్టు 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆర్‌సీబీ జట్టు 9 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు.

రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు..

చెన్నై సూపర్ కింగ్స్ – రవీంద్ర జడేజా (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, రీతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోని (కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహిష్ తీక్షణ, రాజ్‌వర్ధన్ హెంగెర్గేకర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), జోష్ హేజిల్‌వుడ్, వనిందు హసరంగా, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.

Also Read: Watch Video: కెప్టెన్ అయితే నువ్వేమైనా తోపా.. నీకు ఆ ఆర్హత లేదంటూ నెటిజన్ల ఫైర్.. ఎందుకంటే?

Sunil Gavaskar: కోహినూర్ డైమండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాం.. మీకు వీలైతే భారత్‌కు తెప్పించండి: గవాస్కర్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu