T20 World Cup 2024: గిల్ ఔట్.. స్టాండ్‌బైగా కేఎల్ రాహుల్.. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఇదే

ఐపీఎల్ 2024 టోర్నీ హోరాహొరీగా జరగుతోంది. అదే సమయంలో చాలా మంది దృష్టి టీ 20 ప్రపంచకప్‌ పైనే ఉంది. ఈ మేజర్ క్రికెట్ టోర్నీ కోసం టీమ్ ఇండియాను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకోసం సెలక్షన్ కమిటీకి మరో 48 గంటల సమయం ఉంది. కాబట్టి సెలక్షన్ కమిటీ ఎప్పుడైనా జట్టును ప్రకటించవచ్చు.

T20 World Cup 2024: గిల్ ఔట్.. స్టాండ్‌బైగా కేఎల్ రాహుల్.. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఇదే
Team India

Updated on: Apr 29, 2024 | 7:52 PM

ఐపీఎల్ 2024 టోర్నీ హోరాహొరీగా జరగుతోంది. అదే సమయంలో చాలా మంది దృష్టి టీ 20 ప్రపంచకప్‌ పైనే ఉంది. ఈ మేజర్ క్రికెట్ టోర్నీ కోసం టీమ్ ఇండియాను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకోసం సెలక్షన్ కమిటీకి మరో 48 గంటల సమయం ఉంది. కాబట్టి సెలక్షన్ కమిటీ ఎప్పుడైనా జట్టును ప్రకటించవచ్చు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్ కప్ లో టీమిండియా ఎంపికపై తమ అభిప్రాయలను పంచుకున్నారు. జట్టులో ఎవరెవరని తీసుకోవాలో, ఎవరెవరిని పక్కకు పెట్టాలో బోర్డుకు సూచిస్తున్నారు. తాజాగా ఈఎస్పీఎన్ క్రికెట్ ఇన్ఫో మొత్తం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రపంచకప్ కోసం ఎంపిక చేసింది. కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంచుకుంది. అయితే ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ కు స్థానం కల్పించలేదు. అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేసుకుంది. అలాగే టాపార్డర్ లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లకు స్థానం కల్పించింది. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్ తో పాటు సంజూ శామ్సన్ కు కూడా అవకాశం ఇచ్చింది. స్పిన్నర్ గా కేవలం కుల్దీప్ యాదవ్ కే ప్రాధాన్యం ఇచ్చింది. అదే సమయంలో పేస్ బౌలర్లుగా జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ లను ఎంచుకుంది. అవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ లకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు కల్పించింది.

టీ20 ప్రపంచకప్ కోసం ఈఎస్ పీఎన్ ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టు:

టాప్ ఆర్డర్ :

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్

మిడిల్ అండ్ లోయర్ మిడిల్ ఆర్డర్ :

సంజు శాంసన్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రింకూ సింగ్
స్పిన్నర్లు : కుల్దీప్ యాదవ్

ఫాస్ట్ బౌలర్లు :

జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్/మహమ్మద్ సిరాజ్

రేసులో ఉన్న ఇతర ఆటగాళ్లు:

కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..