T20 World Cup 2024: ఏడాది తర్వాత అరివీర భయంకర బౌలర్ రీఎంట్రీ.. టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు హడలే

మరో రెండు నెలల్లో ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ 2 ప్రారంభం కానుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్ లో ఇంగ్లండ్ డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు ఓ శుభవార్త అందింది. అదేంటంటే.. గాయం కారణంగా సంవత్సరం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆ జట్టు..

T20 World Cup 2024: ఏడాది తర్వాత అరివీర భయంకర బౌలర్ రీఎంట్రీ.. టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు హడలే
England Cricket Team

Updated on: Apr 06, 2024 | 8:08 PM

మరో రెండు నెలల్లో ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ 2 ప్రారంభం కానుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్ లో ఇంగ్లండ్ డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు ఓ శుభవార్త అందింది. అదేంటంటే.. గాయం కారణంగా 1 సంవత్సరం క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ పూర్తిగా కోలుకున్నాడు. అతనెవరో కాదు బౌన్సర్లతో భయ పెట్టే జోఫ్రా ఆర్చర్. గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్నాడీ ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్. ఈ కారణంగానే గత IPL సీజన్ ODI ప్రపంచ కప్ కూడా ఆడలేకపోయాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శనకు జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణం. లీగ్‌లో ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు ఆర్చర్ పూర్తిగా ఫిట్‌గా ఉండడంతో 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్నాడు.

జోఫ్రా ఆర్చర్ జూన్‌లో వెస్టిండీస్, యూఎస్‌ఏలలో జరిగే టి 20 ప్రపంచ కప్‌లో ఆడటానికి రెడీగా ఉన్నట్లు ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ ధ్రువీకరించారు. ఏడాది పాటు ఇంగ్లండ్‌కు ఆడని ఆర్చర్ వచ్చే నెలలో స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. 29 ఏళ్ల ఆర్చర్ గత మూడేళ్లుగా గాయాలతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే మార్చి 2021 నుండి ఇంగ్లాండ్ తరపున కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఇక గత సంవత్సరం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. అయితే కేవలం ఐదు IPL మ్యాచ్‌లు మాత్రమే ఆడి గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..