ENG vs WI: ఏంది మచ్చా ఇది.. 1504 వికెట్లు తీసిన దిగ్గజాలకే దడ పుట్టించావ్.. ఘన విజయంతో 20 ఏళ్ల బౌలర్ రికార్డ్

|

Jul 22, 2024 | 6:37 AM

England vs West Indies, 2nd Test: లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఇంగ్లండ్ ఏకపక్షంగా ఓడించింది. కానీ, రెండో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ధీటుగా ప్రదర్శన ఆతిథ్య జట్టును ఇబ్బంది పెట్టింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించినా.. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ అదే జోరును ప్రదర్శించలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ENG vs WI: ఏంది మచ్చా ఇది.. 1504 వికెట్లు తీసిన దిగ్గజాలకే దడ పుట్టించావ్.. ఘన విజయంతో 20 ఏళ్ల బౌలర్ రికార్డ్
Shoaib Bashir 5 Wickets Eng Vs Wi
Follow us on

England vs West Indies, 2nd Test: జులై 19, 20 తేదీల్లో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో వెస్టిండీస్ బ్యాటింగ్ చేసిన తీరు.. అదే బ్యాట్స్‌మెన్స్ మరుసటి రోజు అంటే జులై 21న రెండు సెషన్ల వరకు కూడా క్రీజులో ఉండలేకపోతారని ఎవ్వరూ ఊహించలేదు. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను పూర్తిగా ముగియకముందే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, షోయబ్‌ బషీర్‌లు ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ నాలుగో రోజు బ్రూక్, రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీలు సాధించగా, ఈ ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ బషీర్ 5 వికెట్లు తీసి వెస్టిండీస్ ను చిత్తు చేశాడు.

నాటింగ్‌హామ్ టెస్టు నాలుగో రోజు ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. వెస్టిండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల వెనుకంజలో ఉన్న ఇంగ్లండ్ 385 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ఇన్నింగ్స్‌లో జో రూట్ (122), హ్యారీ బ్రూక్ (110) అద్భుత సెంచరీలు చేశారు. వీరిద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొని ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపింది. వెస్టిండీస్ తరపున ఫాస్ట్ బౌలర్ జాడెన్ సీల్స్ 4 వికెట్లు పడగొట్టాడు.

బషీర్ ముందు వెస్టిండీస్ విఫలం..

తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో 457 పరుగులకు ఆలౌటైన వెస్టిండీస్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహాలో రిప్లై ఇస్తుందని భావించారు. అలాగే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ (47), మైకేల్ లూయిస్ కలిసి తొలి వికెట్‌కు 61 పరుగుల బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్‌ స్కోరును కాపాడుకోవడం కష్టమే అనిపించినా క్రిస్‌ వోక్స్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత ఆఫ్ స్పిన్నర్ బషీర్ వచ్చి ఇక్కడి నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్‌పై చుక్కలు చూపించాడు. బషీర్ 4 వికెట్లు తీసి వెస్టిండీస్ ఓటమి కథను రచించాడు. చివరి వికెట్ కూడా బషీర్ బంతికే పడిపోవడంతో అతడికి 5వ వికెట్ కావడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ 143 పరుగులకే కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి

1504 వికెట్లతో దిగ్గజాలా అద్భుతం..

దీంతో పాటు తన ఐదో టెస్టులోనే మూడోసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఘనతను బషీర్‌ చేశాడు. ఇందులోనూ తన ఇంగ్లిష్ గడ్డపై తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. విశేషమేమిటంటే.. 1504 టెస్టు వికెట్లు తీసిన ఇద్దరు దిగ్గజాల ఫీట్‌ను బషీర్ కూడా పునరావృతం చేశాడు. మొట్టమొదట, నాటింగ్‌హామ్ మైదానంలో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన శ్రీలంక గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు) తర్వాత బషీర్ మొదటి స్పిన్నర్‌గా నిలిచాడు. 2006లో మురళి అలాంటి సంచలనం సృష్టించాడు. 704 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్ రికార్డును బద్దలు కొట్టిన బషీర్.. హోమ్ టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు. అండర్సన్ 21 ఏళ్ల వయసులో ఈ పని చేయగా, బషీర్ 20 ఏళ్ల వయసులో ఇలాంటీ ఫీట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..