INDW vs ENGW: భారత మహిళలు మరోసారి ఓడారు. సిరీస్ ను 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ టీంకు అప్పగించారు. మరోసారి మిథాలీ ఆకట్టుకున్నా ఫలితం మారలేదు. రెండో వన్డేలో ఇంగ్లండ్ మహిళలు 5 వికెట్లతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుచుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు.. నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. అయితే, ఈ మ్యాచ్ లో 200 స్కోరు దాటినా విజయం సాధించలేకపోవడం గమనార్హం. ఓపెనర్లు స్మృతి మంధాన(22), షెఫాలీ వర్మ(44) రెండో వన్డేలో మంచి ఆరంభం ఇచ్చినా.. మిడిలార్డర్ తడబడడంతో భారీ స్కోర్ చేయలేక చతికలపడింది. మరోసారి మిథాలీ రాజ్ ఆకట్టుకుంది. జెమీమా రోడ్రిగ్స్(8), దీప్తీ శర్మ(5), స్నేహ్ రాణా(5), హర్మన్ ప్రీత్ కౌర్(19), తానియా భాటియా (2), శిఖా పాండే(2) ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్ 5, సోఫీ ఎకెల్‌స్టోన్ 3 వికెట్లు సాధించారు.
222 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ మహిళలు.. మరో 15 బంతులు మిగిలుండగానే విజయం సాధించారు. ఇంగ్లండ్ ఓపెనర్ లారెన్ విన్‌ఫీల్డ్ హిల్(42), సోఫియా డంక్లీ(73 నాటౌట్), కేతరిన్ బ్రంట్(33 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 2 వికెట్లు, జూలన్ గోస్వామి, శిఖా పాండే, స్నేహ్ రాణా తలో వికెట్ పడగొట్టారు. ఈమ్యాచ్ లో కేట్ క్రాస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
That’s the summary of the 2nd WODI. A spirited fightback by #TeamIndia but it wasn’t enough. England win by 5 wickets. #ENGvIND pic.twitter.com/vdvxebGS72
— BCCI Women (@BCCIWomen) June 30, 2021
Also Read:
India in Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు భారత బాక్సర్లు సిద్ధం; పతకాల వేటలో గెలిచేది ఎందరో..?