ENG vs SL: ఇరు జట్లకు చావో రేవో.. మరికాసేపట్లో శ్రీలంక వర్సెస్‌ ఇంగ్లండ్‌ కీలక మ్యాచ్‌.. గత రికార్డులివే

ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ 2023లో ఇవాళ (అక్టోబర్‌ 26) ఇంగ్లండ్‌, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ హై వోల్టేజీ మ్యాచ్‌ ఇరు జట్లకు చావో రేవో లాంటిది. ఓడిపోతే ఇరు జట్లు దాదాపు ఇంటికే. కాబట్టి విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.

ENG vs SL: ఇరు జట్లకు చావో రేవో.. మరికాసేపట్లో శ్రీలంక వర్సెస్‌ ఇంగ్లండ్‌ కీలక మ్యాచ్‌.. గత రికార్డులివే
England Vs Sri Lanka

Updated on: Oct 26, 2023 | 10:44 AM

 

ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ 2023లో ఇవాళ (అక్టోబర్‌ 26) ఇంగ్లండ్‌, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ హై వోల్టేజీ మ్యాచ్‌ ఇరు జట్లకు చావో రేవో లాంటిది. ఓడిపోతే ఇరు జట్లు దాదాపు ఇంటికే. కాబట్టి విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా వరల్డ్‌కప్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ ఆటతీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడి, ఒక్కటి మాత్రమే గెలిచింది. సెమీస్‌లోకి ప్రవేశించాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లిష్‌ జట్టు విజయం సాధించాలి. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సమన్వయంతో కూడిన ప్రదర్శన ఇవ్వడంలో ఇంగ్లండ్‌ జట్టు బాగా ఇబ్బంది పడుతోంది. అటు కెప్టెన్‌గానూ, ఆటగాడిగానూ బట్లర్ ఫెయిలవుతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 170 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో చేతులెత్తేసి ప్రత్యర్థికి ఏకంగా 399 పరుగులు ఇచ్చారు. ఇలా అన్ని విభాగాల్లోనూ ఇంగ్లిష్‌ జట్టు విఫలమవుతుండడం వారి ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.

ఇవి కూడా చదవండి

లంకది అదే పరిస్థితి..

మరోవైపు శ్రీలంకది అదే పరిస్థితి. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలిచి మూడింటిలో ఓడిపోయారు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఓడిపోతే లంకేయులు కూడా దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఆసియాకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన శ్రీలంక.. ప్రపంచకప్‌లో మాత్రం చతికిలపడింది. దీనికి తోడు దసున్ షనక, హసరంగా వంటి స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం ఆ జట్టు ఆటతీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు భారీ విజయం సాధించడం కాస్త రిలీఫ్‌. అయితే బౌలింగ్‌లో లంకేయులు మరింత మెరుగుపడాల్సి ఉంది. మరి ఈరోజు ఆంగ్లేయులపై ఎలా రాణిస్తారో చూడాలి.

బ్యాటర్లకు స్వర్గధామమే..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 367 పరుగులు చేసింది. ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు కొంత సహాయం లభించినప్పటికీ, మైదానం చిన్నది కావడంతో బౌండరీల వర్షం కురిసే అవకాశం ఉంది. బెంగుళూరులో 31 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతతో ఎండ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాలు కురిసే అవకాశం లేదు.

ఇంగ్లండ్‌ దే ఆధిపత్యం..

ఇక గత రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇంగ్లండ్, శ్రీలంక జట్లు 78 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 38 మ్యాచ్‌లు గెలవగా, శ్రీలంక 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఇంగ్లండ్ ప్రాబబుల్ ప్లేయింగ్‌ XI :

జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్‌ అండ్‌ వికెట్‌ కీపర్‌), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్

 

శ్రీలంక.. ప్రాబబుల్ ప్లేయింగ్‌ XI

పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (సి, డబ్ల్యూకే), సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..